»   » బెల్లంకొండ నెక్స్ట్ ఆ యంగ్ హీరోతో ఖరారు

బెల్లంకొండ నెక్స్ట్ ఆ యంగ్ హీరోతో ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

కందీరీగ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని ఇచ్చిన బెల్లంకొండ సురేష్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు. ఆయన తదుపరి చిత్రాన్ని కూడా వినోదం రంగరించిన రూటులో వెళ్ళి తీయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందుకు సీమ శాస్త్రి,సీమ టపాకాయ వంటి కామిడీ చిత్రాలను గతంలో అందించిన జి నాగేశ్వర రెడ్డిని దర్శకుడుగా ఎన్నుకున్నారు. వాస్తవానికి నాగేశ్వర రెడ్డి తన తదుపరి చిత్రాన్ని అల్లరి నరేష్ తో ప్లాన్ చేసుకున్నారు. కానీ నిర్మాతతో వచ్చిన విభేధాలుతో ఆ చిత్రాన్ని విరమించుకున్నట్లు తెలుస్తోంది.

ఇక విష్ణు కూడా వస్తాడు నా రాజు చిత్రం అనంతరం ఏ చిత్రమూ చేయలేదు. అక్టోబరులో షూటింగ్ మొదలయ్యే ఈ చిత్రం వినోద ప్రధానమైన కథతో మాస్‌, యాక్షన్‌ అంశాలకీ చోటుంటుందని చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఇక చిత్రాన్ని విష్ణు కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన 'ఢీ' తరహాలో మలచాలని బెల్లంకొండ భావిస్తున్నారు. ప్రస్తుతం బెల్లంకొండ...వెంకటేష్ హీరోగా బాడీగార్డ్ రీమేక్ చేస్తున్నారు.త్రిష హీరోయిన్ గా చేస్తున్న ఆ చిత్రాన్ని డాన్ శీను తో పరిచయమైన గోపీచంద్ మలినేని డైరక్ట్ చేస్తున్నారు.

English summary
After almost six months, Manchu Vishnu is gearing up for his next film. He was last seen in Vasthaadu Naa Raju which had released in February, 2011. Now, his next film is going to be produced by Nageshwara Reddy and prominent producer, Bellamkonda Suresh is going to produce it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu