»   » అఫీషియల్: బోయపాటి నెక్ట్స్ బాలయ్య కాదు?

అఫీషియల్: బోయపాటి నెక్ట్స్ బాలయ్య కాదు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రస్తుతం అల్లు అర్జున్ తో సరైనోడు చిత్రం షూటింగ్ బిజీలో ఉన్న బోయపాటి శ్రీనివాసు తన తదపరి ప్రాజెక్టు బాలకృష్ణతో ఉంటుందని అంతా భావించారు. అందులోనూ బాలయ్య వందో సినిమా కావటంతో ఖచ్చితంగా బోయపాటేతోనే అని అనుకున్నారు. అయితే ఇప్పుడు అందుతున్న వార్తలను బట్టి...అభిమానులు డైలమోలో పడుతున్నారు.

బోయపాటి తన తదుపరి చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ కుమారుడు ..శ్రీనివాస్ తోచేస్తున్నారని అఫీషియల్ గా శ్రీనివాస్ ప్రకటించారు. ఈ చిత్రానికి నైజాం ఫిల్మ్ డిస్టిబ్యూటర్ అయిన అభిషేక్ పిక్చర్స్ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు ఈ సినిమాను మార్చ్ నెలలో స్టార్ట్ చేసి, ఏప్రిల్ నుండి రెగ్యూలర్ షూటింగ్ చేస్తారని తెలుస్తోంది.

Bellamkonda Srinivas next by a distributor

బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ...నా సెకండ్ ప్రాజెక్టు బోయపాటిగారితో చేయాల్సింది. కానీ అంతకంటే ముందే బన్నీ, బోయపాటి సినిమా చేయాలనుకున్నారు. కానీ బన్నీ ఆరు నెలలు పాటు బిజీగా ఉండటంతో ఆ గ్యాప్ లో నాతో చేయాలని అనుకున్నారు. కానీ కథ సంతృప్తిగా లేకపోవటంతో ఆగిపోయాం. ఏప్రియల్ 8నుంచి బోయపాటిగారి సినిమా ఉంటుంది. అభిషేక్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్నారు. మార్చి నుంచి ఉంటుంది.

ప్రస్తుతం బెల్లంకొండ శీను, బీమినేని శ్రీనివాస రావ్ డైరక్షన్ లో స్పీడున్నోడు సినిమాలో నటిస్తున్నాడు. తమిళ సూపర్ హిట్ సినిమా సుందరపాండియన్ కి రీమెక్ గా ఈ సినిమా రుపోందుతోంది. వచ్చె నెలలో ఈ సినమా రిలీజ్ కు రెడీ అవుతోంది.

Bellamkonda Srinivas next by a distributor

అల్లు అర్జున్ సరైనోడు తో బోయాపాటి కూడా బిజీగానే వున్నారు. ఈ చిత్రం కూడా చాలా త్వరగానే పూర్తవుతోంది. సమ్మర్ స్పెషల్ గా విడుదలకు సిద్దం అవుతోంది. వీటి తర్వాతే ఈ కొత్త కాంబినేషన్ లో వీరి సినిమా పట్టాలెక్కబోతోంది.

English summary
Recent entrant into Nizam film distribution, Abhishek Pictures is turning into production. They will be producing Bellamkonda Srinivas' next under the direction of Boyapati Srinu. The film will have its launch in March and the regular shooting will begin in April.Bellamkonda Srinivas is currently working on the Telugu remake of Tamil blockbuster ‘Sundarapandian’ which is titled 'Speedunnodu'. The movie is being helmed by Bheemaneni Srinivasa Rao and is being planned for next month release. Boyapati was to direct him earlier but the project did not happen then for some reason.
Please Wait while comments are loading...