twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బస్ స్టాప్’సెన్సార్ కట్స్ పై బెల్లంకొండ సురేష్ వివరణ

    By Srikanya
    |

    హైదరాబాద్ : బెల్లంకొండ సురేష్ తాజా చిత్రం 'బస్ స్టాప్' ఈ రోజు(ఆదివారం) విడుదల అవుతోంది. చిత్రం రిలీజ్ కు ముందు ఈ చిత్రంకు 42 కట్స్ పడ్డాయని, రివైజింగ్ కమిటీకి వెళ్ళారని, అక్కడా మరికొన్ని కట్స్ పడ్డాయని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఊహించని విధంగా కేవలం ఐదు కట్స్ తో చిత్రం విడుదలకు రెడీ అయ్యింది. దాంతో మీడియాలో ఈ విషయానికి ప్రయారిటీ వచ్చింది. టీవీ ఛానెల్స్ లో ఈ చిత్రానికి హఠాత్తుగా రాత్రికిరాత్రి ఎలా సెన్సార్ కట్స్ తగ్గిపోయాయని ప్రశ్నిస్తూ కథనాలు వచ్చాయి. అయితే ఈ విషయాలని బెల్లంకొండ సురేష్ ఖండిస్తున్నారు.

    బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ... ''మా సినిమాకి 40, 50 కత్తెర్లిచ్చారన్నది వాస్తవం కాదు. సెన్సార్ బోర్డ్‌వారిని కట్స్ లేకుండా 'ఎ' సర్టిఫికెట్ ఇవ్వమంటే కుదరదన్నారు. దాంతో రివైజింగ్ కమిటీకి వెళ్లాం. అక్కడా కుదరదంటే.. డబుల్ ఎస్‌ఆర్‌సీకి వెళ్లాం. వాళ్లు చిన్న చిన్న కట్స్ ఇచ్చి, 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చారు. పిల్లలు, పెద్దలు తప్పక చూడాల్సిన చిత్రం. శనివారం సాయంత్రం రాష్ట్రంలో ఉన్న అన్ని మల్టిప్లెక్స్ థియేటర్స్‌లో ఈ చిత్రం ప్రదర్శన ఆరంభమైంది. ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం'' అన్నారు.

    ప్రిన్స్, శ్రీదివ్య జంటగా మారుతి దర్శకత్వంలో మల్టీడైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ రజత్ పార్ధసారథి సమర్పణలో బెల్లంకొండ సురేష్ నిర్మించిన చిత్రం 'బస్‌స్టాప్'. ఈ చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బెల్లంకొండ మాట్లాడుతూ పై విధంగా స్పందించారు. ''యువతను ఎంటర్‌టైన్ చేస్తూనే వారికి వాత పెట్టే చిత్రం ఇది. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం'' అని మారుతి చెప్పారు. ఈ చిత్రాన్ని మారుతి క్లారిటీతో తీశాడని రావు రమేష్ అన్నారు. ఈ చిత్రం విజయం సాధిస్తుందని ప్రిన్స్, శ్రీదివ్య తదితరులు తమ నమ్మకాన్ని వ్యక్తపరిచారు.

    English summary
    Taken aback by the apparent arbitrariness of the Censor Board, which had recommended an unthinkable 45 cuts to Maruthi's 'Bus Stop', Bellamkonda Suresh approached some days ago a Review Committee, complaining about the illegitimacy of such recommendation. Fortunately for the makers, the Review Committee has taken a more rational view, suggesting only 5 cuts.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X