twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రవితేజ ‘బెంగాల్ టైగర్’ ప్రారంభం (ఫోటోస్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: బలుపు, పవర్ వంటి వరుస సూపర్ హిట్ చిత్రాలతో మాంచి ఊపుమీదున్న మాస్ మహరాజ్‌ రవితేజ హీరోగా, మిల్కి బ్యూటి త‌మ‌న్నా, స్మైలింగ్ సుంద‌రి రాశి ఖ‌న్నాలు క‌ధానాయిక‌లుగా, రచ్చ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన‌ సంపత్ నంది దర్శకత్వంలో నటించనున్న విషయం తెలిసిందే.

    సంపత్ నంది దర్శకత్వం వహించబోతున్న ఈ చిత్రం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో శుక్రవారం(జనవరి 30) ఉదయం ఈ చిత్రం ప్రారంభోత్సవం జరిగింది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి సినీ ప్రముఖులు రాఘవేంద్రరావు, వివి వినాయక్, సురేంద్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

    హీరో హీరోయిన్లు రవితేజ-రవితేజలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి రాఘవేంద్రరావు క్లాప్ కొట్టారు. వివి వినాయక్ కెమెరా స్విచాన్ చేసారు. సురేందర్ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఏమైంది ఈవేళ, అధినేత, ప్యార్ మే పడిపోయానే వంటి ప్రేక్షకాదరణ పొందిన చిత్రాల్ని అందించిన అభిరుచి గల నిర్మాత కె కె రాధామోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో ప్రతిష్టాత్మకంగా రవితేజ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

    స్లైడ్ షెలో ఫోటోలు, వివరాలు

    రవితేజ

    రవితేజ

    సంపత్ నంది చెప్పిన కథను సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేశాను. సంపత్ నంది అందరినీ ఎంటర్ టైన్ చేయగల సత్తా ఉన్న పవర్ ఫుల్ డైరెక్టర్. ఫుల్ మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్ర కథను తీర్చిదిద్దాడు. అన్ని వర్గాల్ని ఆకట్టుకునే కథ ఇది. మాస్ ఎలిమెంట్స్‌తో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు వుంటాయి. కమర్షియల్ సినిమాకు కావాల్సిన అంశాలన్నీ ఈ చిత్రంలో ఉంటాయి. కథకు తగ్గట్టుగా ఈ చిత్రానికి పవర్ ఫుల్ టైటిల్ బెంగాల్ టైగర్ అనే టైటిల్ ఖరారు చేశాం. నిర్మాత రాధామోహన్ సినిమాల మీద ప్యాషన్ ఉన్న వ్యక్తి. ఆయన బ్యానర్లో సినిమా చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అని అన్నారు.

    నిర్మాత కె కె రాధామోహన్ మాట్లాడుతూ....

    నిర్మాత కె కె రాధామోహన్ మాట్లాడుతూ....

    ఏమైంది ఈవేళ, అధినేత, ప్యార్ మే పడిపోయానే వంటి మోస్తరు బడ్జెట్ చిత్రాలు నిర్మించిన నాకు మాస్ మహారాజ రవితేజ అవకాశం ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనకు రుణపడి ఉంటాను. ఆయన మా మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేశామని తెలిపారు.

    ఫుల్ మాస్ ఎంటర్టెనర్

    ఫుల్ మాస్ ఎంటర్టెనర్

    సంపత్ నంది చెప్పిన కథ అన్ని వర్గాల్ని ఆకట్టుకునేలా ఉంది. సంప‌త్ నంది ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. కథకు తగ్గట్టుగా బెంగాల్ టైగర్ టైటిల్ పెట్టాం. టైటిల్ కు తగ్గట్టుగానే హీరో క్యారెక్టరైజేషన్ డిజైన్ చేశామని నిర్మాత తెలిపారు.

    బోమన్ ఇరానీ

    బోమన్ ఇరానీ

    బాలీవుడ్ ఉత్త‌మ న‌టుడు బోమ‌న్ ఇరాని ఏ చిత్రం చేయాల‌న్నా క‌థ‌కి ఇంపార్టెన్స్ ఇస్తారు. తెలుగులో అత్తారింటికి దారేది చిత్రం త‌రువాత తెలుగులో ఎన్నో క‌థ‌లు విన్నా కూడా ఏ క‌థ‌ని ఫైన‌ల్ చేయ‌లేదు. ఇప్ప‌డు చాలా గ్యాప్ తీసుకుని మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ , సంప‌త్ నంది కాంబినేష‌న్ లో వ‌స్తున్న బెంగాల్ టైగ‌ర్ చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయ‌న‌ మెయిన్ కేర‌క్ట‌ర్ చేయ‌టం విశేషం గా చెప్పుకోవాలి.

    మార్చి నుండి రెగ్యులర్ షూటింగ్

    మార్చి నుండి రెగ్యులర్ షూటింగ్

    ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మార్చి నుండి మొదలు కానుంది.

    దర్శకుడు సంపత్‌నంది మాట్లాడుతూ...

    దర్శకుడు సంపత్‌నంది మాట్లాడుతూ...

    మాస్ మహరాజ్ రవితేజతో సినిమా చేయాలన్న నా కోరిక ఈ సినిమాతో తీరుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సినిమాల మీద అభిరుచి ఉన్న నిర్మాత కె కె రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ఖర్చుకు వెనకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేశారు. రవితేజ ఎనర్జిటిక్ పెర్ ఫార్మెన్స్ కు తగ్గట్టుగా ఈ చిత్ర కథ సిద్ధమైంది. అంతే పవర్ ఫుల్ గా ఉండేలా బెంగాల్ టైగర్ అనే టైటిల్ పెట్టాం.

    రవితేజ తమన్నా మధ్య

    రవితేజ తమన్నా మధ్య

    రవితేజ, తమన్నా మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయి. రవితేజ నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉంటాయి. రవితేజ ఫ్యాన్స్ ఆశించే మాస్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దుతున్నాం. నా మీద నమ్మకంతో సింగిల్ సిట్టింగ్ లో కథను ఓకే చేసిన రవితేజ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అత్తారింటికి దారేది లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రంలలో న‌టించిన బాలీవుడ్ బెస్ట్ ఆర్టిస్ట్ బోమ‌న్ ఇరాని రెండ‌వ చిత్రంగా మా చిత్రం చేయ‌టం చాలా ఆనందంగా వుంది అన్నారు దర్శకుడు

    నటీనటులు

    నటీనటులు

    ఈ చిత్ర‌లో మాస్‌మ‌హ‌రాజ్ ర‌వితేజ‌, త‌మ‌న్నా, రాశిఖ‌న్నా, బోమ‌న్ ఇరాని, రావు ర‌మేష్‌, షియాజి షిండే, నాజ‌ర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి తదిత‌రులు న‌టించ‌గా..

    తెర వెనక

    తెర వెనక

    బ్యాన‌ర్‌..శ్రీ స‌త్యసాయి ఆర్ట్స్‌ కెమోరా.. సుందర రాజ‌న్‌, ఎడిట‌ర్‌.. గౌత‌మ్‌రాజు, ఆర్ట్‌.. డి,వై.స‌త్య‌నారాయ‌ణ‌, ఫైట్స్‌: రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌, నిర్మాత‌..కె.కె.రాథామెహ‌న్‌, క‌థ‌-మాట‌లు-స్ర్కీన్‌ప్లే-ద‌ర్శ‌క‌త్వం.. సంప‌త్ నంది.

    English summary
    Bengal tiger Movie Launch event held at Hyderabad. Ravi Teja, Tamannaah Bhatia and others graced the event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X