»   » ‘బెంగాల్ టైగర్’ రిలీజ్ డేట్ పోస్టర్ ఇదే..

‘బెంగాల్ టైగర్’ రిలీజ్ డేట్ పోస్టర్ ఇదే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రవితేజ, తమన్నా, రాశి ఖన్నా ముఖ్య తారాగణంగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బెంగాల్ టైగర్' చిత్రం ఈ నెల 10న విడుదలవుతున్న నేపథ్యంలో రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. U/A సర్టిఫికెట్ అందుకుంది.

ఈ మధ్య రవితేజకు భారీ హిట్ లేదు. చివరగా విడుదలైన కిక్ 2 అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు మాస్ మహరాజ్ అభిమానులు. ఈ సినిమా హిట్టయితేనే రవితేజ కెరీర్ సాపీగా ముందుకు సాగుతుంది.

Bengal Tiger release date poster

ఈ చిత్రంలో రవితేజ తను అమితంగా ప్రేమించే తండ్రిని చంపిన విలన్స్ ని సంహరించి, పగ తీర్చుకునే కొడుకుగా కనిపించనున్నట్లు సమాచారం. ఇది పూర్తిగా ఫ్యామిలీ రివేంజ్ డ్రామాగా సాగనుందని తెలుస్తోంది. ర‌వి తేజ స‌ర‌స‌న త‌మన్న, రాశి ఖ‌న్నాలు ఆడిపాడ‌ునున్నారు.

బెంగాల్ టైగర్ లో ఇంకా బోమన్ ఇరానీ, బ్రహ్మానందం, రావు రమేష్, షాయాజీ షిండే, నాజర్, పోసాని కృష్ణ మురళీ, తనికెళ్ల భరణి, హర్షవర్ధన్ రానె, సురేఖా వాణి, అక్ష, శ్యామల, ప్రియ, ప్రభు, ప్రగతి, నాగినీడు, ప్రభ, రమాప్రభ తదతరులు నటించారు. ఈ చిత్రానికి కెమెరా: సౌందర్ రాజన్, ఎడిటర్: గౌతం రాజు, ఆర్ట్: డి.వై.సత్యనారాయణ, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, సంగీతం: బీమ్స్, నిర్మాత: కె.కె.రాధామోహన్, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సంపత్ నంది.

English summary
Bengal Tiger is up for release this 10th of December and according to the latest update, the action entertainer has received an U/A certification from the censors.
Please Wait while comments are loading...