»   » ‘బెంగాల్ టైగర్’ శాటిలైట్ రైట్స్‌ రేటు అదిరింది

‘బెంగాల్ టైగర్’ శాటిలైట్ రైట్స్‌ రేటు అదిరింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మాస్ మహరాజ్ రవితేజ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ‘బెంగాల్ టైగర్' ఈ రోజు గ్రాండ్ విడుదలైన సంగతి తెలిసిందే. కాగా సినిమా విడుదల ముందు నుండే భారీ హైప్ ఉండటంతో ఈ చిత్రాన్ని జెమినీ టీవీ వారు భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రూ. 7.5 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం.

రవితేజ కెరీర్లోనే శాటిలైట్ రైట్స్‌కు ఇంత భారీ రేటు రావడం ఇదే తొలిసారి. ఈచిత్రంలో రవితేజ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా, మరో హాట్ బ్యూటీ రాశి ఖన్నాతో పాటు బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ కూడా నటించారు. అమలాపాల్‌గా బ్రహ్మానందం కామెడీ సినిమాకు హైలెట్ అవుతుంది. బీమ్స్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని కె.కె.రాధా మోహన్ నిర్మించారు.


‘Bengal Tiger’ satellite rights

U/A సెన్సార్ సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రంలో రవితేజ తను అమితంగా ప్రేమించే తండ్రిని చంపిన విలన్స్ ని సంహరించి, పగ తీర్చుకునే కొడుకుగా కనిపించనున్నట్లు సమాచారం. ఇది పూర్తిగా ఫ్యామిలీ రివేంజ్ డ్రామాగా సాగనుందని తెలుస్తోంది. ర‌వి తేజ స‌ర‌స‌న త‌మన్న, రాశి ఖ‌న్నాల రొమాన్స్ ప్రేక్షకులకు మంచి ఎంటర్టెన్మెంట్ అందిస్తాయి.


ఇంకా బోమన్ ఇరానీ, బ్రహ్మానందం, రావు రమేష్, షాయాజీ షిండే, నాజర్, పోసాని కృష్ణ మురళీ, తనికెళ్ల భరణి, హర్షవర్ధన్ రానె, సురేఖా వాణి, అక్ష, శ్యామల, ప్రియ, ప్రభు, ప్రగతి, నాగినీడు, ప్రభ, రమాప్రభ తదతరులు నటించారు. ఈ చిత్రానికి కెమెరా: సౌందర్ రాజన్, ఎడిటర్: గౌతం రాజు, ఆర్ట్: డి.వై.సత్యనారాయణ, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, సంగీతం: బీమ్స్, నిర్మాత: కె.కె.రాధామోహన్, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సంపత్ నంది.

English summary
As per the latest reports, the satellite rights of Ravi Teja’s ‘Bengal Tiger’ have been bought by Gemini TV for a whopping Rs. 7.5 crores.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu