»   » యూరప్‌లో రవితేజ-తమన్నా రొమాన్స్

యూరప్‌లో రవితేజ-తమన్నా రొమాన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బలుపు, పవర్, కిక్ 2 వంటి వరుస సూపర్ హిట్ చిత్రాలతో మాంచి ఊపుమీదున్న మాస్ మహరాజ రవితేజ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో బెంగాల్ టైగర్ చిత్రంలో నటిస్తున్నారు. అందాల ముద్దుగుమ్మ మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్. ఈ చిత్రాన్ని ఏమైంది ఈవేళ, అధినేత, ప్యార్ మే పడిపోయానే వంటి ప్రేక్షకాదరణ పొందిన చిత్రాల్ని అందించిన అభిరుచి గల నిర్మాత కె కె రాధామోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో ప్రతిష్టాత్మకంగా రవితేజ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

నిర్మాత కె కె రాధామోహన్ మాట్లాడుతూ... బెంగాల్ టైగర్ చిత్ర షూటింగ్ అనుకున్న విధంగా... అనుకున్న టైం ప్రకారం ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుగుతోంది. రవితేజ ఎనర్జిటిక్ పెర్ ఫార్మెన్స్ అందరిమీ మెస్మరైజ్ చేస్తుంది. బెంగాల్ టైగర్ ఫస్ట్ లుక్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. సంపత్ నంది అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే చిత్రంగా మలుస్తున్నారు. ఈనెల 8నుంచి యూరప్ లో షూటింగ్ చేయబోతున్నాం. చిత్ర ప్రధాన తారాగణం యూరప్ షూటింగ్ లో పాల్గొంటారు. యూరప్ షూటింగ్ తో బెంగాల్ టైగర్ చిత్రీకరణ పూర్తవుతుంది. త్వరలోనే ఆడియో, రిలీజ్ డేట్స్ ప్రకటిస్తాం. అని అన్నారు.

Bengal Tiger shooting Europe

దర్శకుడు సంపత్‌నంది మాట్లాడుతూ... మాస్ మహరాజ్ రవితేజతో సినిమా చేయాలన్న తన కోరిక ఈ సినిమాతో తీరుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. రవితేజ గారి పెర్ ఫార్మెన్స్ హైలైట్ గా ఉంటుంది. బెంగాల్ టైగర్ ఫస్ట్ లుక్ కి రెస్పాన్స్ సూపర్ గా వచ్చింది. ఈ రెస్పాన్స్ మాకు మంచి ఎనర్జీ ఇచ్చింది. ఈనెల 8 నుంచి యూరప్ షూటింగ్ కి ప్లాన్ చేశాం. అక్కడి అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించబోతున్నాం. నిర్మాత రాధా మోహన్ ఖర్చుకు వెనకాడకుండా గ్రాండియర్ గా నిర్మిస్తున్నారు. తమన్ ఎక్స్ ట్రార్డినరీ మ్యూజిక్ ఇస్తున్నారు. అని అన్నారు.

English summary
Bengal Tiger movie next schedule shooting in Europe.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu