twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బెంగాలీ దర్శకుడు రీతూ పర్ణోఘోష్ మృతి

    By Bojja Kumar
    |

    Rituparno Ghosh
    కోల్‌కతా : ప్రముఖ బెంగాలీ దర్శకుడు రీతుపర్ణో ఘోష్(49) మృతి చెందారు. గురువారం ఉదయం గుండె పోటు రావడంతో ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన గత కొంత కాలంగా pancreatitis సమస్యతో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది.

    కోల్‌కతాలో పుట్టిపెరిగిన రీతూపర్ణో ఘోష్ ఆర్ట్ సినిమాలు తీయడంలో ప్రఖ్యాతిగాంచారు. 19 ఏళ్ల ఆయన సినీ ప్రస్థానంలో ఇప్పటికు 12 జాతీయ అవార్డులను దక్కించుకున్నారు. 'చిత్రాంగద' అనే చిత్రానికి గాను గతేడాది కూడా ఆయనకు జాతీయ అవార్డు అందుకున్నారు.

    యాడ్ ఫిల్మ్స్ ద్వారా కెరీర్ ప్రారంభించిన రీతుపర్ణో ఘోష్....1994లో తొలిసారిగా Hirer Angti (Diamond ring) అనే చిత్రాన్ని రూపొందించారు. ఐశ్వర్యరాయ్ దర్శకత్వం వహించిన హిందీ చిత్రాలు Chokher Bali, Raincoat దర్శకత్వం వహించారు. అదే విధంగా అమితాబ్, ప్రీతిజింతాలతో The Last Lear అనే చిత్రాన్ని రూపొందించారు.

    నిన్న ఘోస్ తన ట్విట్టర్లో 'సత్యాన్వేషి చిత్రం షూటింగ్ ముగిసింది. ఇదో క్రైం థ్రిల్లర్ మూవీ' అని ట్వీట్ చేసారు. ఘోష్ రెండు టెలివిజన్ చాట్ షోలు నిర్వహించడం ద్వారా కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఈటీవీ బెంగాళీ చానల్‌లో ఆయన నిర్వహించే 'Ebong Rituporno', స్టార్ జల్సా ఛానల్ లో 'Ghosh and co.' కార్యక్రమాలు ప్రేక్షకాదరణ పొందాయి. రీతూపర్ణో మరణ వార్తతో సినీలోకం విషాదంలో మునిగిపోయింది.

    English summary
    
 Bengali director Rituparno Ghosh passed away around 7.30 am today, May 30. He was 49. Ghosh was reportedly suffering from pancreatitis.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X