»   » అవకాశాల్లేక యువ మ్యూజీషియన్ ఆత్మహత్య

అవకాశాల్లేక యువ మ్యూజీషియన్ ఆత్మహత్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగళూరుకు చెందిన యువ మ్యూజీసియన్ కరణ్ జోసెఫ్(29) ముంబయిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 12వ అంతస్తు నుండి దూకడంతో అతడు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అవకాశాల్లేక డిప్రెషన్‌కు లోనై ఆత్మహత్యకు పాల్పడ్డట్లు అనుమానిస్తున్నారు.

కరణ్‌ జోసెఫ్‌ గత నెల రోజులుగా బాంద్రాలోని తన స్నేహితుడి ఇంట్లో ఉంటున్నాడు. మ్యూజీషియన్‌గా అవకాశాల కోసం ముంబయి వచ్చిన కరణ్‌ కొంతకాలంగా డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

శుక్రవారం రాత్రి తన స్నేహితులతో కలిసి ఫ్లాట్‌లో టీవీ చూస్తున్న కరణ్‌ ఉన్నట్టుండి 12వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటికే కరణ్‌ మద్యం మత్తులో ఉన్నట్లు స్నేహితులు తెలిపారు.

సూసైడ్ నోట్ ఏమీ లేక పోవడంతో అతడి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియ లేదని, వివరాల కోసం అతని మొబైల్‌ను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించినట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై ప్రముఖ బాలీవుడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ విశాల్‌ డాడ్లానీ ట్విటర్‌ ద్వారా కరణ్‌ మృతికి సంతాపం వ్యక్తం తెలిపారు.

English summary
A 29-year-old musician from Bengaluru, Karan Joseph, allegedly committed suicide by jumping off the 12th floor of a high-rise in suburban Bandra in Mumbai, the police said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu