అనుష్క డైరెక్టర్ కి బంపర్ ఆఫర్..అంతర్జాతీయ సినిమా!
పిల్ల జమిందార్ చిత్రంతో అశోక్ దర్శకుడిగా తన ప్రతిభని చాటుకున్నాడు. ఆ తరువాత అశోక్ సుకుమారుడు, పిల్ల జమిందార్ వంటి చిత్రాలు తెరెక్కించాడు. కానీ ఆ రెండు చిత్రాలు నిరాశ పరిచాయి. కొంత గ్యాప్ తీసుకుని భాగమతి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అశోక్ టేకింగ్, అనుష్క మ్యాజిక్ పనిచేయడంతో భాగమతి మంచి విజయం సాధించింది. అశోక్ కు ఇప్పుడు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.

అశోక్ ని ఓ బంపర్ ఆఫర్ వరించింది. అంతర్జాతీయ చిత్రానికి దర్శత్వం వహించే అవకాశం అశోక్ కు కలిగింది. బ్రిటిష్ కాలం నాటి కథతో ఈ దర్శకుడు సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని పెన్ ఎన్ ప్రొడక్షన్స్ మరియు కెనడియన్ ఫిలిం కంపెనీ కలసి నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. కోమగట మరు అనే స్టీమ్ షిప్ లో భారతీయలు కెనడాకు చేరుకునే కథ ఇది.


Click it and Unblock the Notifications











