twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘భాగమతి’ సెట్ వెనక ఆశ్చర్య పరిచే విషయాలు..... (సెట్ ఫోటోస్)

    By Bojja Kumar
    |

    అనుష్క టైటిల్ పాత్ర‌లో యు.వి.క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో న‌టించిన చిత్రం భాగ‌మ‌తి. అశోక్ ద‌ర్శ‌కుడు. వంశీ, ప్ర‌మోద్ నిర్మాత‌లు. ఈ సినిమా జ‌న‌వ‌రి 26న విడుద‌ల కానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు సినిమా కోసం వేసిన భాగమతి బంగ్లా సెట్ ఫోటోలు విడుదల చేశారు. ఆర్ట్ దర్శకుడు రవీందర్‌ నేతృత్వంలో ఈ సెట్ రూపు దిద్దుకుంది. ఈ సెట్ కోసం రూ. 3 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ సెట్ గురించి రవీందర్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

    ఐదు వందల సంవత్సరాల క్రితం నాటి డిజైన్

    ఐదు వందల సంవత్సరాల క్రితం నాటి డిజైన్

    ‘భాగమతి' కథ ప్రకారం అయిదు వందల సంవత్సరాల క్రితం నాటి ఓ పురాతన భనవం అవసరం వచ్చింది. ఇలాంటి భవనం కోసం దేశం మొత్తం వెతికినా కథకు సరిపోయే భవనం దొరకలేదట. దీంతో రూ. 3 కోట్ల ఖర్చు పెట్టి సెట్ వేయక తప్పలేదని ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ తెలిపారు.

    పరిశోధన చేసి మరీ

    పరిశోధన చేసి మరీ

    అయిదువందల సంవత్సరాల క్రితం భవంతులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి కొంత పరిశోధన కూడా చేశామని, అప్పటి మన కట్టడాలను పోలిన విధంగా భారతీయత, విదేశీయత కలగలిపి దీనని రూపొందించామని రవీందర్ తెలిపారు.

    ఎంత పెద్ద బంగ్లా....

    ఎంత పెద్ద బంగ్లా....

    28 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ‘భాగమతి బంగ్లా' సెట్ వేశాం. ఇందులో 189 రాతి స్తంభాలు పది అడుగుల నుండి 40 అడుగుల వరకు ఎత్తు ఉండేవి నిర్మించాం. రెండు అంతస్థులతో 12 గదులతో ఈ బంగ్లా సెట్ వేసినట్లు రవీందర్ తెలిపారు.

    అప్పట్లోనే లిఫ్టు కూడా

    అప్పట్లోనే లిఫ్టు కూడా

    500 సంవత్సరాల క్రితం భవనాల్లో లిఫ్టులు కూడా ఉండేవి. ఆ రోజుల్లోనే లిఫ్ట్‌ని మనుషులు తాళ్లతో లాగేవారు. అలాంటి డిజైన్ తోనే ఈ భవనంలో లిఫ్టు కూడా రూపొందించాము అని రవీందర్ వెల్లడించారు.

    ఎవరూ వాడని రంగులు

    ఎవరూ వాడని రంగులు

    బంగ్లా సెట్ కోసం ఇప్పటి వరకు ఎవరూ వాడని రంగులు వాడటం జరిగింది. రాజుల కాలం నాటి పరిస్థితులు అద్దం పట్టేలా పెద్ద పెద్ద ఫోటో ఫ్రేములతో ఆకర్షనీయంగా సెట్ రూపొందించినట్లు రవీందర్ తెలిపారు.

    29 రోజుల్లోనే పూర్తి

    29 రోజుల్లోనే పూర్తి

    ఇంత పెద్ద సెట్ అయినా కేవలం 29 రోజుల్లో పూర్తి చేశాం. 200మంది కార్మికులు రాత్రి, పగలు పని చేశారు. సెట్ బాగా రావాలనే ఉద్దేశ్యంతో ఖర్చు విషయంలో యూవి క్రియేషన్స్ వారు ఏ మాత్రం వెనకాడలేదు. వారి సపోర్టు ఉండటం వల్లే సెట్ అద్భుతంగా వచ్చింది అని రవీందర్ తెలిపారు.

    భాగమతి సెట్‌కు ప్రముఖుల తాకిడి

    భాగమతి సెట్‌కు ప్రముఖుల తాకిడి

    తోట తరణి, గౌతమ్‌ మేనన్‌, వినాయక్‌, రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌, సుకుమార్‌, సాయిధరమ్‌ తేజ్‌ ఇలా చాలామంది సినీ ప్రముఖులు ఈ సెట్‌ చూడ్డానికి వచ్చారని, ఒక సెట్‌ చూడటానికి ఇంత మంది స్టార్స్ రావడం ఇదే తొలిసారని రవీందర్ తెలిపారు.

    English summary
    Art director Ravinder Reddy designs for Bhaagamathie. Bhaagamathie is an upcoming Indian Telugu-Tamil multilingual thriller film written and directed by G. Ashok. It stars Anushka Shetty in the lead role, with Unni Mukundan, Jayaram, and Asha Sarath in other pivotal roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X