»   » తలపట్టుకున్న నాగార్జున....'భాయ్' ఆడియో ఫోస్ట్ ఫోన్

తలపట్టుకున్న నాగార్జున....'భాయ్' ఆడియో ఫోస్ట్ ఫోన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఈ మధ్య 'గ్రీకువీరుడు'గా అలరించలేక పోయిన అక్కినేని నాగార్జున ఈ నెల్లోనే 'భాయ్'గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆదివారం (అక్టోబర్ 5) ఈ చిత్రం ఆడియో విడుదలకు ప్లాన్ చేసుకున్నారు. అయితే రాష్ట్ర విభజన నోట్ తో సీమాంధ్రలో బంద్ కు పిలుపు ఇవ్వటంతో నాగార్జున ఈ ఈవెంట్ ని ఆపుచేయనున్నట్లు సమాచారం. కొత్త ఆడియో విడుదల తేదీ త్వరలో తెలుస్తుంది.

ఇక ఈ సినిమా ప్రారంభం నుంచే దీనిపై అంచనాలు ఏర్పడ్డాయంటే దానికి కారణం ఆ చిత్ర దర్శకుడు వీరభద్రమ్. ఆయనకు ఇది మూడో చిత్రం. ఇదివరకు ఆయన రూపొందించిన 'అహ నా పెళ్లంట', 'పూలరంగడు' ఒకదాన్ని మించి మరొకటి విజయం సాధించడంతో 'భాయ్'తో ఆయన హ్యాట్రిక్ సాధించడం ఖాయమంటూ యూనిట్ సభ్యులు గట్టి నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

ఇందులో మూడు ఛాయలున్న పాత్రలో నాగార్జున కనిపించే తీరు, ఆయన నటన ప్రేక్షకుల్ని అమితంగా అలరిస్తాయని చెబుతున్నారు. రిచా గంగోపాధ్యాయ్ నాయికగా నటించిన ఈ సినిమాలో చాలా మంది పేరుపొందిన నటీనటులు కనిపించనున్నారు. నాగార్జున స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.

అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై. లిమిటెడ్ సమర్పణలో నాగార్జున నిర్మిస్తున్న ఈ చిత్రానికి వీరభద్రమ్ దర్శకుడు. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పిస్తోంది. రిచా గంగోపాధ్యాయ్ నాయిక. దర్శకుడు వీరభద్రమ్ మాట్లాడుతూ "ఆడియో చాలా బాగా వచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు. రీరికార్డింగ్ కూడా టెర్రిఫిక్‌గా ఇచ్చారు. ఇదివరకు విడుదల చేసిన టీజర్‌కు అనూహ్యమైన స్పందన లభించింది. భిన్నమైన ఛాయలున్న పాత్రలో నాగార్జునగారు విజృంభించి నటించారు. యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్, సెంటిమెంట్ సమపాళ్లలో మేళవించిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని బాగా అలరిస్తుంది. కచ్చితంగా నాకు హ్యాట్రిక్ మూవీ అవుతుంది'' అని చెప్పారు.

నథాలియా కౌర్, కామ్నా జెఠ్మలానీ, హంసానందిని, జరా షా, బ్రహ్మానందం, సోనూ సూద్, ఆశిశ్ విద్యార్థి, సాయాజీ షిండే, ఆదిత్య మీనన్, సుప్రీత్, అజయ్, ఎమ్మెస్ నారాయణ తారాగణమైన ఈ చిత్రానికి మాటలు: సందీప్, రత్నబాబు, పాటలు: రామజోగయ్యశాస్త్రి, అనంత శ్రీరామ్, ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి.

English summary
Music launch even of Nagarjuna starrer Bhai has been postponed. It was schedule to happen this weekend (Oct 5) but in the wake of protests and bundh in Seemandhra region, actor and producer Nagarjuna has decided not to hold the event. New date will be announced later.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu