»   » 'అత్తారింటికి దారేది' సినిమా చూశా : నాగార్జున

'అత్తారింటికి దారేది' సినిమా చూశా : నాగార్జున

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : నాగార్జున హీరోగా నటించిన చిత్రం 'భాయ్‌'. రిచా గంగోపాధ్యాయ హీరోయిన్. వీరభద్రమ్‌ దర్శకత్వం వహించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని గీతాలు ఇటీవల హైదరాబాద్‌లో విడుదలయ్యి మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ చిత్రం అక్టోబర్ 25న విడుదల చేయటానికి రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసారని సమాచారం. ఈ విషయమై అఫీషియల్ గా ప్రకటన వచ్చే అవకాసం ఉంది.


నాగార్జున మాట్లాడుతూ '' ఈ కథ నా కోసం ఏడేళ్ల క్రితం రాసుకొన్నాడు వీరభద్రమ్‌. అతనికి మాస్‌ ప్రేక్షకుల నాడి తెలుసు. 'భాయ్‌' అతనికి హ్యాట్రిక్‌ సినిమా అవుతుంది. మంచి సంభాషణలు కుదిరాయి. ఈ మధ్యే 'అత్తారింటికి దారేది' సినిమా చూశాను. చాలా బాగుంది. పైరసీ దాడికి గురైనా.. విజయం సాధించింది. సినిమా బాగుంటే విజయాన్ని ఎవరూ ఆపలేరు అని ఆ సినిమా నిరూపించింది. మాకూ ఓ ధైర్యం ఇచ్చింది''అన్నారు.

వీరభద్రమ్ మాట్లాడుతూ... ''అన్నపూర్ణ సంస్థలో చేయాలని ప్రతి దర్శకుడి కల. అది నాకు మూడో సినిమాతోనే నెరవేరింది. నాగార్జునకు వందశాతం సరిపడే టైటిల్‌ ఇది. దేవి ఇచ్చిన పాటలు ఈ సినిమాకి అదనపు బలం. రెండున్నర గంటలు కడుపుబ్బా నవ్వించే చక్కటి హాస్య చిత్రమిది. 'హలో బ్రదర్' తరహాలో నాగార్జున పాత్ర చిత్రణ వుంటుంది. నాగార్జున సంభాషణలు, మేనరిజమ్స్ సరికొత్త పంథాలో వుంటాయి. ఆయన అభిమానుల్ని అలరించే అంశాలన్నీ 'భాయ్'లో వున్నాయి'' అని దర్శకుడు చెప్పారు. '

'ఈ సినిమాలో నేను రాధికగా కనిపిస్తాను. నాగ్‌తో పనిచేయడం మంచి అనుభవం. ఆయన్ని చూసి ఎన్నో విషయాలు నేర్చుకొన్నా'' అని రిచా చెప్పింది. ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సమీర్ రెడ్డి, మాటలు : సందీప్, రత్నబాబు, పాటలు : రామ జోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్, అడిషనల్ డైలాగ్స్ : ప్రవీణ్, శృతిక్, ఫైట్స్ : విజయ్, డ్రాగన్, ప్రకాష్, ఎడిటింగ్ : కార్తీక శ్రీనివాస్, ఆర్ట్ : నాగేంద్ర, డాన్స్ : బృంద, గణేష్ స్వామి, అడిషనల్ స్క్రీన్ ప్లే : విక్రమ్ రాజ్, కో-డైరెక్టర్ : గంగాధర్ వర్దినీడి, కాస్ట్యూమ్స్ : పి.శేఖర్ బాబు, ఎస్.కె.ఫిరోజ్, మేకప్, గడ్డం శివ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఎన్. సాయిబాబు, నిర్మాత : అక్కినేని నాగార్జున, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : వీరభద్రం.

English summary

 Nagarjuna is now planning on releasing his much awaited Bhai on the 25th of October. Music for the film has been scored by DSP and has been received fondly by the audiences. Bhai stars Richa Gangopadhyay as heroine.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu