»   » అలా ...పవన్ కళ్యాణ్ కి నాగార్జున కౌంటర్??

అలా ...పవన్ కళ్యాణ్ కి నాగార్జున కౌంటర్??

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో ఒకటే చర్చగా నడుస్తోంది...అది పవన్ కళ్యాణ్ కి నాగార్జున కౌంటర్ వేసాడా అని...అయితే అది పర్శనల్ గా కాదు. నాగార్జున తాజా చిత్రం భాయ్ లో డైలాగ్ ...పవన్ ని ఉద్దేశించిందే అంటున్నారు. కావాలనే ఇలాంటి డైలాగ్ దర్శకుడు రాయించి పెట్టాడని చెప్పుకుంటున్నారు.

ఇంతకీ పవన్ కౌంటర్ గా భావిస్తున్న ఆ డైలాగ్ ఏమిటంటే... నాగార్జున ప్రక్కనుండే నర్శింగ్ యాదవ్ క్యారెక్టర్.. భాయ్...ఇక్కడ ఎవరికి వారు ట్రెండ్ సెట్ చేసామన్న భ్రమలో ఉన్నారు.. అసలు ట్రెండ్ క్రియేట్ చేసిందే నువ్వు కదా భాయ్ అంటాడు.

గబ్బర్ సింగ్..లో పవన్ కళ్యాణ్ ... ట్రెండ్ నేను ఫాలో కాను..ట్రెండ్ సెట్ చేస్తాను అంటాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు నాగార్జున ఈ చిత్రంలో ట్రెండ్ క్రియేట్ చేసిందే నేన ు అంటున్నారు. ఇలా డైలాగ్స్ ద్వారా కౌంటర్స్ ఇచ్చుకుంటున్నారు.

ఇక 'హైదరాబాద్‌కి రెండే ఫేమస్‌. ఒకటి ఛాయ్‌. రెండోది భాయ్‌' అంటూ వస్తున్నారు నాగార్జున. ఈ భాయ్‌లో మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ సినిమా కోసం స్లొవేనియాలో 700ఏళ్ల చరిత్ర ఉన్న ప్రెడ్జమా అనే కోటలో పాటను చిత్రించారు. దీని గురించి నాగార్జున చెబుతూ ''పురాతనమైన కోట అయినా ఎంతో కొత్తగా ఉందది. ప్రేక్షకులకు విదేశీ అందాలను పరిచయం చేయడానికే ఇలాంటి ప్రత్యేకమైన ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపాము''అన్నారు.


ఇందులో నాగ్‌ సరసన రిచా గంగోపాధ్యాయ నటిస్తోంది. వీరభద్రమ్‌ చౌదరి దర్శకుడు. ఈ సినిమా ప్రారంభం నుంచే దీనిపై అంచనాలు ఏర్పడ్డాయంటే దానికి కారణం ఆ చిత్ర దర్శకుడు వీరభద్రమ్. ఆయనకు ఇది మూడో చిత్రం. ఇదివరకు ఆయన రూపొందించిన 'అహ నా పెళ్లంట', 'పూలరంగడు' ఒకదాన్ని మించి మరొకటి విజయం సాధించడంతో 'భాయ్'తో ఆయన హ్యాట్రిక్ సాధించడం ఖాయమంటూ యూనిట్ సభ్యులు గట్టి నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

దర్శకుడు వీరభద్రమ్ మాట్లాడుతూ "ఆడియో చాలా బాగా వచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు. రీరికార్డింగ్ కూడా టెర్రిఫిక్‌గా ఇచ్చారు. ఇదివరకు విడుదల చేసిన టీజర్‌కు అనూహ్యమైన స్పందన లభించింది. భిన్నమైన ఛాయలున్న పాత్రలో నాగార్జునగారు విజృంభించి నటించారు. యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్, సెంటిమెంట్ సమపాళ్లలో మేళవించిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని బాగా అలరిస్తుంది. కచ్చితంగా నాకు హ్యాట్రిక్ మూవీ అవుతుంది'' అని చెప్పారు.

అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై. లిమిటెడ్ సమర్పణలో నాగార్జున నిర్మిస్తున్న ఈ చిత్రానికి వీరభద్రమ్ దర్శకుడు. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పిస్తోంది. రిచా గంగోపాధ్యాయ్ హీరోయిన్. నథాలియా కౌర్, కామ్నా జెఠ్మలానీ, హంసానందిని, జరా షా, బ్రహ్మానందం, సోనూ సూద్, ఆశిశ్ విద్యార్థి, సాయాజీ షిండే, ఆదిత్య మీనన్, సుప్రీత్, అజయ్, ఎమ్మెస్ నారాయణ తారాగణమైన ఈ చిత్రానికి మాటలు: సందీప్, రత్నబాబు, పాటలు: రామజోగయ్యశాస్త్రి, అనంత శ్రీరామ్, ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి.

English summary
Film nagar circles are talking about Nagarjuna’s dialogue in Bhai. The dialogue seems to be a counter to Pawan’s trend setter dialogue, or so we hear. Nag says it seems ‘Asalu trend srishtinchinde nenu kadaa ra!’
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu