»   »  నాగ్ 'భాయ్‌' విడుదల ఎప్పుడు?

నాగ్ 'భాయ్‌' విడుదల ఎప్పుడు?

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : నాగార్జున, రిచా గంగోపాధ్యాయ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'భాయ్‌'. అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వీరభద్రమ్‌ చౌదరి దర్శకుడు. ఈ చిత్రం ఆగస్టు లో ఆడియోని విడుదల చేసి, వినాయిక చవితికి సినిమా విడుదల చేసే ఆలోచలో ఉన్నట్లు సమాచారం.

ఇక ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో పాత బస్తీ వాతావరణాన్ని తలపించేలా ప్రత్యేకంగా సెట్‌ని తీర్చిదిద్దారు. అందులో నాగార్జున, రాహుల్‌ దేవ్‌లపై పోరాట సన్నివేశాల్ని చిత్రిస్తున్నారు. వీటికి ఫైట్‌ మాస్టర్‌ విజయ్‌ నేతృత్వం వహిస్తున్నారు.

దర్శకుడు మాట్లాడుతూ... ''వినోదానికి పెద్ద పీట వేసిన కథ ఇది. మాస్‌, యాక్షన్‌ అంశాలు ఉంటాయి. నాగార్జున పాత్ర అన్ని వర్గాల ప్రేక్షకులకీ నచ్చేలా ఉంటుంది. క్లైమాక్స్ సీన్స్, ఓ పాటని చిత్రించాల్సి ఉంది'' అన్నారు. ఈ చిత్రంలో హంసా నందిని, కామ్న జెఠ్మలానీ, నథాలియా కౌర్‌, సోనూ సూద్‌, ఆశిష్‌ విద్యార్థి, అజయ్‌, బ్రహ్మానందం, ఎమ్మెస్‌ నారాయణ తదితరులు నటిస్తున్నారు.

నాగార్జున ఈ చిత్రం గురించి మాట్లాడుతూ....భాయ్ చిత్రం సీరియస్‌గా వుండే దావుద్ ఇబ్రహీం లాంటి కథ అని భావిస్తున్నారని, కానీ పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ చిత్రం ఉంటుందని ఆయన వివరించారు. అలాగే'భాయ్' పేరుతో వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి నిజమే, కాని అది మాఫియా నేపథ్యం కాదు. 'హలో బ్రదర్' సినిమా తరహాలో పూర్తి వినోదాత్మకంగా వుంటుంది. ఇందులో నా పాత్ర 'కింగ్'లో బొట్టు శ్రీనులా వినోదాన్ని పంచుతుంది అన్నారు. ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌.

English summary

 Nagarjuna starrer Bhai’s an action comedy that is directed by Veerabhadram. The film is produced by Nagarjuna under his Annapurna Studios. Nag has been paired with Richa Gangopadhyay. Audio release will happen in August and the film is set for September 1st week/2nd week release during the period of Ganesh Chaturthi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu