»   » దాంతో నా మీద నాకే గౌరవం పోయింది: నాగార్జున

దాంతో నా మీద నాకే గౌరవం పోయింది: నాగార్జున

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నేను 2013లో చేసిన 'గ్రీకువీరుడు', కన్నా 'భాయ్‌' ఎక్కువగా బాధపెట్టింది. ఎందుకంటే దీనికి నిర్మాతను కూడా నేనే. ఎంతగా అంటే నా మీద నాకే గౌరవం పోయింది. సినిమా చూస్తామని నా స్నేహితులు, కుటుంబ సభ్యులు అన్నా నేను ఒప్పుకోలేదు. చూస్తే మీకు కూడా నా మీద గౌరవం పోతుంది వద్దు అని చెప్పాను. మరెందుకు చేశారు అని అడగొచ్చు... దానికి నా దగ్గరే సరైన సమాధానం లేదు అంటూ చెప్పుకొచ్చారు నాగార్జున.

'భాయ్' విషయంలో దారి తప్పాను. నాకు రెగ్యులర్ సినిమాల మీద ఆసక్తి పోయింది. ఇప్పటికే ఒప్పుకున్న గోపాల్‌రెడ్డి సినిమా, బెల్లంకొండ సురేశ్ సినిమాలను కేన్సిల్ చేసుకున్నా. ఇప్పుడు 'మనం' కాకుండా వేరే ఏ సినిమా చేయట్లేదు. నేనేమీ పర్‌ఫెక్ట్ మేన్‌ని కాదు. అందుకే 'భాయ్' విషయంలో దారి తప్పాను. దాన్ని నేనే నిర్మించాను కాబట్టి ఆ సినిమా విషయంలో ఎవరినీ నిందించ దలచుకోలేదు. ఆ సినిమా చూశాక నా మీద నాకే గౌరవం పోయింది. అది చూసిన జనానికి కూడా నా మీద గౌరవం తగ్గిందనుకుంటున్నా. అందుకే నా కుటుంబంలో ఎవరికీ దాన్ని చూపించలేదు. దాని ద్వారా వచ్చిన నష్టాన్నంతా నేనే భరించాను. ఇకనుంచీ కొత్తదనం ఉన్న సినిమాలే చేయాలని నిర్ణయించుకున్నా. కథ నన్ను ఎగ్జయిట్ చేస్తే తప్ప చేయను. నేనే కాదు, చాలా మంది అదే దృష్టితో ఉంటున్నారు.

కొత్త సినిమాలేమిటీ అనే ప్రశ్న ఎప్పుడూ వస్తుంటుంది. దానికి నా దగ్గర నుంచి వచ్చే సమాధానం ఒక్కటే. రెగ్యులర్‌ సినిమాల మీద ఆసక్తి పోయింది. ఒక ఐటెమ్‌ సాంగ్‌, ఫైట్లు, నాలుగు వినోద సన్నివేశాలు... లాంటి కూర్పు ఉన్న సినిమాలు ఇక చెయ్యను. వైవిధ్యమైన కథలకే నా ఓటు.

13 సంఖ్య మంచిది కాదు అని కొందరు అంటుంటారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ... నాకు మాత్రం 2013 ఇబ్బందికర ఫలితాలు, అనుభవాల్నే అందించింది. వ్యక్తిగత జీవితం, సినిమా జీవితం రెండింటిలోనూ ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అయితే నిర్మాతగా మాత్రం 'ఉయ్యాలా జంపాలా' కాస్త ఆనందాన్నిచ్చింది'' అన్నారు నాగార్జున. ఆయన నిర్మాతగా వ్యవహరించిన 'ఉయ్యాలా జంపాలా' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి విజయవంతమైంది.

English summary
Nag said, “Bhai was a mistake. It is a horrible film. Today I feel ashamed that I did Bhai.” Nagarjuna is not happy as the year 2013 closes. He says that this year was horrible for him. There were two biggies and both were flops. One was Greekuveerudu and the other was Bhai. Nagarjuna is in particularly displeased with the way Bhai fared.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu