For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  42 మంది నటులు,వెయ్యి గెటప్‌లు...( ఆదిశంకర ప్రివ్యూ)

  By Srikanya
  |

  హైదరాబాద్ : 'మంజునాథ', 'అన్నమయ్య', 'శ్రీరామదాసు' వంటి ఆధ్యాత్మిక భక్తిరసాత్మక పరిమళాలు వెదజల్లిన దర్శకరచయిత జె.కె. భారవి. రచయితగా మరపురాని చిత్రాలను అందించిన ఆయన యువతలో చైతన్యాన్ని రగిల్చి హిందూ ధర్మ పరిరక్షణ కోసం పోరాడిన ఆదిశంకరాచార్యుల జీవితం నేపథ్యంలో ఆధ్యాత్మిక అద్భుతంగా తెరకెక్కించిన సినిమా 'జగద్గురు ఆదిశంకర'. నారా జయశ్రీదేవి నిర్మించిన ఈ సినిమా ఈ రోజు ....స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకొస్తోంది.

  అద్వైత సిద్ధాంతం గురించి ప్రపంచానికి చాటి చెప్పిన ఆదిశంకరుడి కథ ఇది. ఇందులో ఆయన జగద్గురుగా ఎలా ఎదిగారనేది చూపిస్తున్నారు. ముఫ్పైరెండేళ్ల వయసులోనే కాశీ నుంచి కన్యాకుమారి వరకూ నాలుగు సార్లు పాదయాత్ర చేసిన ఆది శంకరుని ప్రయాణంలో ఆయన్ని ప్రభావితం చేసిన వ్యక్తులు, ఆయనకు తారసపడిన సంఘటనల నేపథ్యంలో సాగే కథ ఇది. చండాలుడు (నాగార్జున), రుద్రాక్షస్వామి (మోహన్‌బాబు) పాత్రలు కూడా కీలకమే.

  Bhairavi Adi Shankaracharya preview

  దర్శకుడు మాట్లాడుతూ ''హిందూ సంస్కృతి గొప్పదనం చెప్పే ప్రయత్నం ఇది. యువతరానికి ఆదిశంకర ఏం చెప్పాడో తెలియాలి. ఆయన నుంచి వచ్చిన ప్రతి మాటా ఓ వ్యక్తిత్వ వికాస పాఠమే. నాగార్జున, మోహన్‌బాబు పోషించిన పాత్రలు ఆకట్టుకొంటాయి. ఈ సినిమాలో చిరంజీవిగారి గొంతు కూడా వినిపిస్తుంది. పాటలు ఇప్పటికే జనాదరణ పొందాయి'' అన్నారు.

  అలాగే....ఒక అద్భుతమైన కథ తెర రూపం దాల్చుతోందంటే దాని కోసం ఏదైనా చేయడానికి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వున్న ప్రముఖ నటీనటులంతా ముందుకొస్తారనడానికి ఈ సినిమానే నిదర్శనం. రచయితగా నన్ను అంతా ప్రేమిస్తారు. చిత్రపరిక్షిశమలో నేను సంపాదించుకున్న ఆస్తి ఏదైనా వుందంటే ఇదే. 'జగద్గురు ఆదిశంకర' ఓ భారీ మల్టీస్టారర్ సినిమా అని చెప్పొచ్చు. ఇందులో మొత్తం 42 మంది ప్రముఖ నటీనటులు నటించారు. టైటిల్ పాత్రలో కౌషిక్‌బాబు నభూతో నభవిష్యతి అన్న రీతిలో నటించాడు. చండాలుడి పాత్ర కనిపించేది కొంత మేరకే అయినా ఆ పాత్ర సినిమా ప్రారంభం నుంచి చివరిదాకా సందర్భానుసారం కనిపిస్తుంది. ఈ పాత్రలో అక్కినేని నాగార్జున కనిపిస్తారు. ఇక కథకు కీలకమైన పాత్రలో రుద్రాక్ష రుషిగా కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు నటించారు. ఈ పాత్రకు ఆయన ఒక్క రూపాయి కూడా తీసుకోకపోవడం విశేషం.

  రాజరుషి పాత్రలో రియల్‌స్టార్ శ్రీహరి పాత్ర ఆకట్టుకుంటుంది. సాధువు పాత్రలో నాగబాబు నటించారు. అద్భుతమైన పాత్రలో సాయికుమార్ కనిపిస్తారు.'పోలీస్‌స్టోరీ' తరువాత ఆ స్థాయి పాత్రలో నటించానని సాయి చెప్పడం విశేషం. తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని పాత్రని కమలినీముఖర్జి చేసింది. ఇలా ప్రతి ఒక్కరూ తమ సినీ కెరీర్‌లో ఇంత వరకు పోషించని పాత్రల్లో కనిపించి ఆ పాత్రలను రక్తికట్టించారు. ప్రముఖ నటీనటుల కలయికలో తెరకెక్కిన 'జగద్గురు ఆదిశంకర' తెలుగు తెరపై ఓ అద్భుతమైన దృశ్య కావ్యంగా నిలిచిపోతుంది. 42 మంది నటులు వెయ్యి గెటప్‌లు ఈ సినిమా ప్రత్యేకత. ఇవి భవిష్యత్ తరాలు భద్రంగా దాచుకునే విధంగా ఉంటాయి. ఈ సినిమా కోసం దేశంలోనే అత్యున్నతమైన గాయకులైన 16 మంది గాయనీ గాయకులు పాటలు పాడారు. ప్రతి పాటా ఓ ఆణిముత్యంలా ఆకట్టుకుంటుంది అని చెప్పుకొచ్చారు.

  సంస్థ: గ్లోబల్‌ పీస్‌ క్రియేటర్స్‌

  నటీనటులు: కౌశిక్‌బాబు, నాగార్జున, మోహన్‌బాబు, శ్రీహరి, సాయికుమార్‌, సుమన్‌, ఏవీఎస్‌, నాగబాబు, మీనా, కామ్నాజెఠ్మలానీ తదితరులు.

  ఛాయాగ్రహణం: పి.కె.హెచ్‌.దాస్‌,

  పాటలు: ఆదిశంకరాచార్య, శ్రీవేదవ్యాస,

  సంగీతం: నాగ్‌శ్రీవత్స,

  ఎడిటింగ్‌: గౌతంరాజు,

  కొరియోగ్రఫీ: అమ్మ రాజశేఖర్‌, రమణ,

  ఆర్ట్‌: కిశోర్‌-మోహన్‌,

  ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌: ఉదయభాస్కర్‌,

  కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జె.కె.భారవి.

  సమర్పణ: నారా జయశ్రీదేవి

  విడుదల: గురువారం.

  English summary
  
 
 Jagadguru Adi Shankara is an ensemble cast Telugu biographical-devotional film directed by J. K. Bharavi releasing today. It is the cinematic of life of Adi Shankara. The crux of the story forms the clash between Chandaludu and Lord Siva. Bharavi stresses that the film is targeted at the youth. The world addressed a 32-year-old as a Jagadguru for unifying 72 faiths and for successfully completing a Pada Yatra four times from Kashmir to Kanyakumari. How Shankara attained an iconic status in such a short period, the struggles he went through to reach the pinnacle of glory is portrayed in the film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X