»   » అమెరికాలో ‘భలే భలే మగాడివోయ్’ అద్భుతం

అమెరికాలో ‘భలే భలే మగాడివోయ్’ అద్భుతం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లు అర‌వింద్ సమ‌ర్ప‌ణ‌లో, యువి క్రియేషన్ష్ మ‌రియు జిఏ2 (ఎ డివిజన్ ఆప్ గీతా ఆర్ట్స్) సంయుక్తంగా ప్రొడక్ష‌న్ నెం. 1 గా రూపొందిన ప‌క్కా ఫ్యామిలీ అండ్ ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్‌ "భ‌లే భ‌లే మ‌గాడివోయ్' చిత్రం సెప్టెంబ‌ర్ 4న విడుద‌ల‌యి సూప‌ర్‌డూప‌ర్ హిట్ టాక్ మ‌రియు క‌లెక్ష‌న్లు సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది.

తాజాగా ఈ చిత్రం యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద అద్భుతాలు సృష్టిస్తోంది. విడుదలైన తొలి వారంలోపే ఈ చిత్రం 1 మిలియన్ డాలర్ వసూళ్లను అందుకుంది. నాని లాంటి మధ్య స్థాయి హీరో సినిమా ఇక్కడ ఈ రేంజిలో వసూళ్లు సాధించడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. సినిమా టాక్ పాజిటివ్ గా ఉండటం, ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టెనర్ కావడంతో మంచి ఫలితాలు రాబడుతోంది.


Bhale Bhale Magadivoy 1 million mark US box office

సినిమా విడుదలైన రోజు నుండే వసూళ్లు అదరగొడుతోంది. ట్రేడ్ వర్గాల్లో అందుతున్న సమచారం ప్రకారం ఈ చిత్రం తొలి రోజు 3.15 కోట్లు షేర్ సంపాదించింది. రెండో రోజు సైతం ఎ,బి,సి సెంటర్లు తేడాలేకుండా అన్ని చోట్లా సాలిడ్ కలెక్షన్స్ రాబట్టింది. నాని కెరీర్ లో ఈగ తర్వాత ఎక్కువ కలెక్షన్స్ వైజ్ కలెక్టు చేస్తున్న చిత్రం ఇదే.


నాని, లావ‌ణ్య త్రిపాఠి, ముర‌ళి శ‌ర్మ‌, న‌రేష్‌, సితార‌, స్వ‌ప్న మాధురి, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్‌, ప్ర‌వీణ్, ష‌క‌ల‌క శంక‌ర్‌, బ‌ద్ర‌మ్ మ‌రియు త‌దిత‌రులు. ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్: ఎస్‌.కె.ఎన్‌, పి.ఆర్‌.ఓ: ఏలూరు శ్రీను, ఎడిట‌ర్:ఉద్ద‌వ్‌,ఆర్ట్:ర‌మణ వంక‌, ఫొటొగ్రఫి:నిజార్ ష‌ఫి, సంగీతం: గోపి సుంద‌ర్, నిర్మాత:బ‌న్నివాసు ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:మారుతి.

English summary
Nani’s Bhale Bhale Magadivoy has crossed the 1 million mark at the US box office after its first week of release.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu