»   » నాని, లావణ్య త్రిపాఠి హాట్ సాంగ్... (మేకింగ్ వీడియో)

నాని, లావణ్య త్రిపాఠి హాట్ సాంగ్... (మేకింగ్ వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాని, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం ‘భలే భలే మగాడివోయ్'. మారుతి ద‌ర్శకుడు. బ‌న్నివాసు నిర్మాత‌. ఇటీవ‌లే గోవాలోని అందమైన లొకేషన్స్ లో ఓ పాట చిత్రీక‌రించారు. మ‌రో పాట‌ని హైద‌రాబాద్ లో చిత్రీక‌రించ‌టంతో టోట‌ల్ షూటింగ్ పూర్త‌యింది. ఈ పాటల‌కు శేఖర్ మాస్టర్ నృత్య రీతులు స‌మ‌కూర్చారు. తాజాగా సాంగ్ చిత్రీకరణకు సంబంధించిన మేకింగ్ వీడియో విడుదలైంది. లావణ్య త్రిపాఠి నాభి అందాల ప్రదర్శనతో సూపర్ హాట్ గా ఉన్న ఈ సాంగుపై మీరూ ఓ లక్కేయండి.

ఆడియోని అగ‌ష్టు మెద‌టి వారంలో విడుద‌ల చేసి అగ‌ష్టులోనే చిత్రాన్ని కూడా విడుద‌ల చేయ‌టానికి నిర్మాతలు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ: " భలే భలే మగాడివోయ్ నా కెరీర్ లో స్పెషల్ సినిమా. ఈ తరహా క్యారెక్టర్ ఇప్పటివరకు చేయలేదు. నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర. ద‌ర్శ‌కుడు మారుతి చెప్పిన క‌థ న‌చ్చ‌టంతో వెంట‌నే అంగీక‌రించ‌మే కాకుండా ఎక‌ధాటిగా షూటింగ్ చేస్తున్నాం.ఇటీవ‌లే గోవాలో , హైద‌రాబాద్ లో రెండు పాట‌లు చిత్రీకరణతో సినిమా క‌ప్లీట‌య్యింది. శేఖర్ మాస్టర్ నా బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లుగా డిజైన్ చేశారు. త‌క్కువ టైంలో ఈచిత్రం పూర్త‌యింది. లావణ్య త్రిపాఠి క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది. మా ఇద్దరి కెమిస్ట్రీ బాగా కుదిరింది. ముర‌ళి శ‌ర్మ స‌ర్‌ప్రైజింగ్ పాత్ర‌లో అందిరిని ఆక‌ట్టుకుంటారు. అల్లు అర‌వింద్ గారి సమ‌ర్ప‌ణ‌లో, GA2 (A Division of GeethaArts) బాన్య‌ర్ పై UV Creations బ్యాన‌ర్ లో బ‌న్నివాసు నిర్మాత‌గా ఈచిత్రం చేయ‌టం చాలా హ్య‌పిగా వుంది. ఎక్క‌డా ఎటువంటి డిస్ట‌బెన్స్ లేకుండా షూటింగ్ అంతా అయిపోయంది. తప్ప‌కుండా ఫ్యామిలి అంతా ధియోట‌ర్స్ కి వెళ్ళి చూడాల్సిన చిత్రం. " అని అన్నారు.

నాని, లావ‌ణ్య త్రిపాఠి, ముర‌ళి శ‌ర్మ‌, న‌రేష్‌, సితార‌, స్వ‌ప్న మాధురి, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్‌, ప్ర‌వీణ్, ష‌క‌ల‌క శంక‌ర్‌, బ‌ద్ర‌మ్ మ‌రియు త‌దిత‌రులు నటించారు. ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్: ఎస్‌.కె.ఎన్‌, ఎడిట‌ర్:ఉద్ద‌వ్‌,ఆర్ట్:ర‌మణ వంక‌, ఫొటొగ్రఫి:నిజార్ ష‌ఫి, సంగీతం: గోపి సుంద‌ర్, నిర్మాత:బ‌న్నివాసు, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:మారుతి.

English summary
Watch Bhale Bhale Magadivoy Movie Making .Starring Nani,Lavanya Tripathi in lead roles. Directed by Maruthi Dasari and Produced by Geetha Arts, UV Creations. Music Composed by Gopi Sunder.
Please Wait while comments are loading...