»   » నాని ‘భలే భలే మగాడివో’ షురూ అయింది

నాని ‘భలే భలే మగాడివో’ షురూ అయింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాని హీరోగా మారుతి దర్శకత్వంలో తరకెక్కుతున్న ‘భలే భలే మగాడివోయ్' చిత్రం సోమవారం ఉదయం ఫిలింనగర్ దైవ సన్నిధానంలో ప్రారంభమైంది. పూజా కార్యక్రమాలతో పాటు రెగ్యులర్ షూటింగ్ కూడా ఈ రోజు నుంచే మొదలు పెట్టనున్నారు. యూత్‌ ఫుల్‌ లవ్ & కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాలో ‘అందాల రాక్షసి' ఫేం లావణ్య త్రిపాఠి హీరోయిన్. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి మోడరన్ సిటీ గర్ల్ పాత్రలో కనిపించనుంది. జిఎ2(గీత ఆర్ట్స్ సంస్థలో భాగం) - యువి క్రియేషన్స్ వారు కలిసి ప్రొడక్షన్ నెం.1గా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ‘కొత్త జంట' తర్వాత కాస్ట్ గ్యాప్ తీసుకున్న మారుతి ఈ సినిమాతో మరో సూపర్ హిట్ అందుకోవాలని పర్ఫెక్ట్ స్క్రిప్ట్ ని రెడీ చేసాడని సమాచారం.

ఈ సంద‌ర్భంగా నిర్మాత బ‌న్నివాసు మాట్లాడుతూ.. మారుతి చెప్పిన క‌థ చాలా ఎంట‌ర్‌టైనింగ్ గా వుంది. మారుతి గ‌తంలో చేసిన చిత్రాల‌కంటే ఈ చిత్రం ఫుల్ అవుటండ్ అవుట్ ల‌వ్ అండ్ ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా వుంటుంది. నాని, లావ‌ణ్య త్రిపాఠి లు హీరోహీరోయిన్స్ గా చేస్తున్నారు. ఈరోజు ఉద‌యం ఫిల్మ్‌న‌గ‌ర్ శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామి దైవ‌స‌న్నిధానంలో పూజాకార్య‌క్ర‌మాల‌తో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మైంది. అల్లు అర‌వింద్ గారు స్వామివారిపై క్లాప్ ఇవ్వ‌గా, ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు గారు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ చిత్రం ఈరోజు నుండి హైద‌రాబాద్ లో రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకుంటుంది. గోపిసుంద‌ర్ సంగీతం అందిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి అగ‌ష్టు లో చిత్రాన్ని విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నాం. అని అన్నారు.

'Bhale Bhale Magadivoy' Shooting start

ద‌ర్శ‌కుడు మారుతి మాట్లాడుతూ.. జిఎ2(గీత ఆర్ట్స్ సంస్థలో భాగం) - యువి క్రియేషన్స్ వారు కలిసి ప్రొడక్షన్ నెం.1గా తెర‌కెక్కుతున్న 'భ‌లే భ‌లే మ‌గాడివోయ్' చిత్రం రెగ్యుల‌ర్ షూట్ ఈరోజు నుండి పూజాకార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. చ‌క్క‌టి ఎంట‌ర్‌టైన్‌మెంట్ వున్న ల‌వ్ స్టోరి. చ‌క్క‌గా సినిమా అంతా న‌వ్వుకునే చిత్రం గా అంద‌రి ప్ర‌శంసలు పొందుతుంది. అని అన్నారు.

ఈ చిత్రంలో న‌టీన‌టులు..నాని, లావ‌ణ్య త్రిపాఠి, ముర‌ళి శ‌ర్మ‌, న‌రేష్‌, సితార‌, స్వ‌ప్న మాధురి, వెన్నెల కిషోర్‌, ప్ర‌వీణ్, బ‌ద్ర‌మ్‌ త‌దిత‌రులు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: ఎస్‌.కె.ఎన్‌, ఎడిట‌ర్: ఉద్ద‌వ్‌, ఆర్ట్ : ర‌మ‌ణ లంక‌, సంగీతం : గోపి సుంద‌ర్(బెంగులూరు డేస్ ఫేం), ఫొటొగ్రఫి :నిజార్ ష‌ఫి, నిర్మాత: బ‌న్నివాసు, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: మారుతి.

English summary
"It's Official! Shooting commences from today for my next film- 'Bhale Bhale Magadivoy'!" Nani said.
Please Wait while comments are loading...