»   »  హ‌య్‌లాండ్‌లో 'భలే భలే మగాడివోయ్' స‌క్స‌ెస్‌మీట్‌

హ‌య్‌లాండ్‌లో 'భలే భలే మగాడివోయ్' స‌క్స‌ెస్‌మీట్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లు అర‌వింద్ సమ‌ర్ప‌ణ‌లో, యువి క్రియేషన్ష్ మ‌రియు జిఏ2 (ఎ డివిజన్ ఆప్ గీతా ఆర్ట్స్) సంయుక్తంగా ప్రొడక్ష‌న్ నెం. 1 గా రూపోందిన ప‌క్కా ఫ్యామిలీ అండ్ ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్‌ "భ‌లే భ‌లే మ‌గాడివోయ్' చిత్రం సెప్టెంబ‌ర్ 4న విడుద‌ల‌యి సూప‌ర్‌డూప‌ర్ హిట్ టాక్ మ‌రియు క‌లెక్ష‌న్లు సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది.

నాని పాత్ర తీరు మ‌మ్మ‌ల్ని న‌వ్వించింది అని ఈచిత్రం చూసిన ఫ్యామిలి అంతా చెప్ప‌టం విశేషం. చాలా రోజుల త‌రువాత ఫుల్ ప్లేడ్జ్‌గా ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రం రావ‌టం హ్య‌పిగా వుంద‌ని ప్రేక్ష‌కుల ఈ చిత్రానికి విజ‌య‌ర‌ధం ప‌ట్టారు. ద‌ర్శ‌కుడు మారుతి ని అభినందించారు. ఈ విజ‌యాన్ని ప్రేక్ష‌కుల తో పంచుకోవ‌టానికి ఈనెల 11న ప్రేక్ష‌కుల స‌మక్షంలో విజ‌యోత్స‌వాన్ని విజ‌య‌వాడ హ‌య్‌లాండ్ లో చిత్ర యూనిట్ జ‌రుపుకుంటున్నారు.


'Bhale Bhale Magadivoy' success celebrations

ద‌ర్శ‌కుడు మారుతి మాట్లాడుతూ: మా చిత్రం 'భలే భలే మగాడివోయ్' అంచ‌నాల‌కి మించి విజ‌యాన్ని ప్రేక్ష‌కులు మా యూనిట్ కి అందించారు.సినిమాలో చిన్న చిన్న స‌న్నివేశాల‌కు కూడా న‌వ్వుతుంటే చాలా ఆనందంగా వుంది. ప్రేమ‌క‌థాచిత్రమ్ త‌రువాత ఇంత‌లా న‌వ్వించిన చిత్రం అంటూ దానిని మించి వుందని కూడా అంటున్నారు. ఈ విజ‌యాన్ని ప్రేక్ష‌కుల తో పంచుకోవ‌టానికి ఈనెల 11న ప్రేక్ష‌కుల స‌మక్షంలో విజ‌యోత్స‌వాన్ని విజ‌య‌వాడ హ‌య్‌లాండ్ లో ప్రేక్ష‌కుల‌తో క‌లిపి జ‌రుపుకుంటున్నాము. . అని అన్నారు


నిర్మాత బ‌న్నివాసు మాట్లాడుతూ.. ద‌ర్శ‌కుడు మారుతి మెద‌ట చెప్పిన‌ట్టే 'భలే భలే మగాడివోయ్' ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పోందుతుంది. . ఫ్యామిలి అంతా న‌వ్వుకునే విధంగా భ‌లేభ‌లేమ‌గాడివోయ్ చిత్రం వుంది. ఈ విజ‌యాన్ని ప్రేక్ష‌కుల తో పంచుకోవ‌టానికి ఈనెల 11న ప్రేక్ష‌కుల స‌మక్షంలో విజ‌యోత్స‌వాన్ని విజ‌య‌వాడ హ‌య్‌లాండ్ లో చిత్ర యూనిట్ జ‌రుపుకుంటుంది " .అని అన్నారు. న‌టీన‌టులు నాని, లావ‌ణ్య త్రిపాఠి, ముర‌ళి శ‌ర్మ‌, న‌రేష్‌, సితార‌, స్వ‌ప్న మాధురి, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్‌, ప్ర‌వీణ్, ష‌క‌ల‌క శంక‌ర్‌, బ‌ద్ర‌మ్ మ‌రియు త‌దిత‌రులు. ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్: ఎస్‌.కె.ఎన్‌, పి.ఆర్‌.ఓ: ఏలూరు శ్రీను, ఎడిట‌ర్:ఉద్ద‌వ్‌,ఆర్ట్:ర‌మణ వంక‌, ఫొటొగ్రఫి:నిజార్ ష‌ఫి, సంగీతం: గోపి సుంద‌ర్, నిర్మాత:బ‌న్నివాసు ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:మారుతి.

English summary
Family and love entertainer 'Bhale Bhale Magadivoy' success celebrations at Haailand in Vijayawada on September 11.
Please Wait while comments are loading...