»   » ఫ్లాఫ్ టాక్...రీమేక్ రైట్స్ అమ్మకం

ఫ్లాఫ్ టాక్...రీమేక్ రైట్స్ అమ్మకం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా ఇండస్ట్రీలో ఏ క్షణానికి ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఫ్లాఫ్ టాక్ మూట కట్టుకున్న చిత్రానికి రీమేక్ రైట్స్ డిమాండ్ రావచ్చు...హిట్ అయ్యిన సినిమాను పట్టించుకునేవారూ లేకపోవచ్చు. తాజాగా అలాంటి సంఘటన చోటు చేసుకున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. తెలుగులో ఈ శుక్రవారం విడుదలైన ‘భమ్ బోలేనాథ్' చిత్రం మార్నింగ్ షోకే ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది. పరమ బోర్ సినిమా అని మీడియాలో రివ్యూలు సైతం వచ్చాయి. థియోటర్ లో జనమూ కనపటం లేదు. అయితే ఈ కాన్సెప్టు కన్నడంకి వర్కవుట్ అవుతుందని భావించి రైట్స్ అమ్ముడుపోయినట్లు సమాచారం.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


వివరాల్లోకి వెళ్ళితే...


నవదీప్, నవీన్‌చంద్ర, ప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘భమ్ బోలేనాథ్'. పూజ హీరోయిన్. ఆర్.సి.సి.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శిరువూరి రాజేష్‌వర్మ నిర్మించిన ఈ చిత్రం ద్వారా కార్తీక్ వర్మ దండు దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ చిత్రాన్ని కన్నడంలో రీమేక్ హక్కులను దండుపాళ్యం, శివమ్ చిత్రాల దర్శక నిర్మాత శ్రీనివాసరాజు దక్కించుకున్నారు. ప్రముఖ తారాగణంతో త్వరలోనే ఆయన కన్నడంలో ఈ చిత్రాన్ని రీమేక్ చేయనున్నారు.


Bham Bholenath to be remade in Kannada

చిత్రం కథ అంతా...నవదీప్, నవీన్ చంద్రల చుట్టూ తిరుగుతుంది. కానీ కథలో వీరికి ఎలాంటి సంబంధం ఉండదు. ఈ ఇద్దరికీ తమ సొంత జీవితంలో పలు ఇబ్బందులు ఉంటాయి. ఒకానొక సందర్భంలో ఇద్దరికీ డబ్బు అవసరం అవుతుంది. ఆ మనీ కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు కానీ ప్రయోజనం లేకపోతుంది. దాంతో ఇక అన్నిటిమీద ఆశ కోల్పోయిన వీరిద్దరూ ఎవరి దారిలో వారు ఒక్కో దొంగతనం ప్లాన్ చేస్తారు.


అనుకున్న దాని ప్రకారం వీరి దొంగతనాలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతాయి. అప్పుడే కథలోకి డ్రగ్ అడిక్ట్ అయిన ప్రదీప్ మాచిరాజు ఎంటర్ అవడంతో అసలైన ట్విస్ట్. దాంతో నవదీప్ - నవీన్ చంద్ర లు ఇబ్బందుల్లో పడతారు. మరి నవదీప్ - నవీన్ చంద్రలు దొంగతనం తర్వాత తమకు వచ్చిన ఇబ్బందులను ఎలా ఎదుర్కున్నారు.? అసలు కథలోకి ఈ ప్రదీప్ ఎందుకు వచ్చాడు.? చివరికి నవదీప్ - నవీన్ చంద్రలు తాము దొంగిలించిన డబ్బును దక్కించుకున్నారా.? లేదా అన్నది వెండితెరపై చూడాల్సిందే..


నవదీప్‌ మాట్లాడుతూ ‘‘సినిమా చూస్తే టైటిల్‌ ఎందుకు పెట్టామో అర్థమవుతుంది. కొత్త స్ర్కీన్‌ప్లేతో వంద శాతం ఎంటర్‌టైనర్‌గా రూపొందించాం'' అని అన్నారు. నవదీప్‌తో కలిసి ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉందని నవీన్‌ చంద్ర తెలిపారు.


దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఇది క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌. అందరికీ నచ్చే సినిమా అవుతుంది'' అని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘కార్తికేయ తర్వాత నేను చేస్తున్న సినిమా ఇది. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమా. '' అని చెప్పారు.


ప్రదీప్‌, పోసాని, పంకజ్‌ కేసరి, కిరీటి, ప్రవీణ్‌, నవీన్‌, రఘు పెన్మెత్స, తాగుబోతు రమేష్‌, ధనరాజ్‌, పృథ్వి, కాదంబరి కిరణ్‌, కాంచి, రజిత, మాధవి, జెమిని సురేష్‌, ఫిష్‌ వెంకట్‌ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు పాటలు: కృష్ణచైతన్య, డ్యాన్స్‌: విజయ్‌, మాటలు: శరణ్‌ కొప్పిశెట్టి, కార్తిక్‌ వర్మ దండు, ఆర్ట్‌: జె.కె.మూర్తి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: రఘు పెన్మత్స, సంగీతం: సాయికార్తిక్‌, సహ నిర్మాతలు: కాకర్లపూడి రామకృష్ణ, యాడ్లపల్లి తేజ.

English summary
Bham Bholenath starring Navdeep, Naveen Chandra movie will be remade in Kannada and the rights have been bought by director Srinivas Raju,who shot to fame with Kannada super hits ‘Dandupalayam’ and ‘Shivam’ .
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu