»   » ఇన్నాళ్ళకు భాను ప్రియ ఆ రహస్యం చెప్పింది.... ఆ ప్రేమ కథ ఏమిటో తెలుసా

ఇన్నాళ్ళకు భాను ప్రియ ఆ రహస్యం చెప్పింది.... ఆ ప్రేమ కథ ఏమిటో తెలుసా

Posted By:
Subscribe to Filmibeat Telugu

భాను ప్రియ అందమైన పెద్ద కళ్ళు.., పెద్ద రంగు లేదు కానీ ఆ మొహం లో విపరీతమైన ఆకర్షణ. నల్లదనం లోనూ ఇంత అందం ఉంటుందా అనిపిచే ఒక లాంటి మోహపూరిత మొహం. "సితార" సినిమా వచ్చిన కొత్తల్లో అంతా ఆ అందం లో పడికొట్తుకు పోయారు. ఏ గ్లామర్ హీరోయిన్ కీ లేని పాపులారిటీ ఈ చీరకట్తు అమ్మాయిజ్కి వచ్చేసింది... అందరికీ సితార లా వచ్చిన భాను పిరియ నచ్చేసింది. కథ మొత్తాన్ని తన చుట్టూ తిప్పుకునే మహల్లో కోకిల గా మరెవరూ ఇక కనిపించరేమో అన్నంత అందంగా కనిపించింది భాను ప్రియ కాదు...కాదు అంత అందంగా చూపించాడు వంశీ...

అసలే గోదావరంటే పడి చచ్చిపోయే పిచ్చి వంశీకి కావేరి లా నల్లగా ఉండే ఈ పెద్ద పెద్ద కళ్ళ పిల్ల కనిపించింది... ఇంకేముందీ కెమెరా మీదినుంచి జల పాతం లా కురిసి న ప్రవాహం లో స్నానం చేసిన ఆ సితార ఇప్పటికీ అలా వెలుగుతూనే ఉంది... ఇంతగా భాను ప్రియ పాత్రను క్రియేట్ చేయడానికి కారణం..!? సీనియర్ వంశీ ఆమెపై మనసు పడ్డాడనీ అందుకే భానుప్రియని మరీ అందంగా చూపించ గలిగేడనీ ఒక పుకారు(?) వినిపించేది. భానుప్రియ కోసం తన కెరీర్ ని నిర్లక్షం చేశాడని కూడా అప్పట్లో చెప్పుకునేవారు.

అయితే.. ఈ లవ్ స్టోరీ అప్పుడు ఏం మలుపు తిరిగిందో కానీ నెమ్మదిగా మరుగున పడిపోయింది.మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత అప్పటి సంగతులపై భానుప్రియ నోరు విప్పడం విశేషం. అప్పుడు వచ్చిన రూమర్స్ నిజానికి రూమర్లు కాదనీ నిజమేనని. తనకు దర్శకుడు వంశీ ప్రపోజ్ చేశాడని చెప్పి ఒక్కసారి మళ్ళీ ఆనాటి సితార మ్నాపకాలని మళ్ళీ రేపింది. అయితే ఆ గోదారి పిచ్చోడు వంశీ ఈ ప్రపోజల్ కి ఆమె రియాక్షన్ ఏంటో చెప్పలేదు కానీ.. తాను ముందుకు పడకపోవడానికి కారణం మాత్రం చెప్పింది.

అప్పటికే దర్శకుడు వంశీ పెళ్లయిన వ్యక్తి కావడంతో.. తన తల్లి పెళ్లికి అంగీకరించలేదని చెప్పింది భానుప్రియ. అలా భాను ప్రియపై వంశీ ప్రేమకు బ్రేక్ పడిందనే సంగతి అర్ధమవుతుంది. తాజాగా తన మెమరీస్ ను వివరిస్తూ.. వంశీ కూడా భానుప్రియ గురించి ఆమె ప్రతిభ గురించి పాజిటివ్ గా రాయడం విశేషం. తన సోషల్ మీడియా పేజ్ లో ఆనాతి భానుప్రియ అదే "సితార" తో తన ఙ్ఞాపకాలని మరోసారి పంచుకున్నాడు.... ఇలా... ఆ విషయాలు ఆయన మాటల్లోనే చూస్తే....

సితార

సితార

సితార.....1984. నా జీవితంలో పహాడీ రాగం వాయించింది సితార, మాసిపోయిన నా ముఖాన్ని వెన్నెల నీళ్ళతో కడిగింది సితార, అరిగి పోయిన నా కాళ్ళకి బూరుగు దూది చెప్పులు తొడిగింది సితార.

మహల్లో కోకిల:

మహల్లో కోకిల:

నా మహల్లో కోకిల పట్టుకుని రాత్రీ పగళ్ళు కూర్చుని పదహారు రోజుల్లో సితార సినిమాకి స్క్రీన్ ప్లే రాశాను.
కానీ, నా లాస్ట్ ఫిల్మ్ సరిగ్గా ఆడక పోడంవల్లనుకుంటాను, ఈ సినిమా డ్రాప్ అవుదామని ఏడిద నాగేశ్వరరావుగారనుకుంటే, వారి బావమరిదీ అల్లుడు... నాకు మిత్రుడు అయిన తాడి బాబ్జీగారు ఏడిద గారితో గొడవపడతా నాకు ఫర్ గా చాలా మాటాడేటప్పటికి ప్రొడక్షన్ స్టార్ట్ అయింది.

హీరో బతకాలి అన్నారు:

హీరో బతకాలి అన్నారు:

మళ్లీ ఇదో క్లాసిక్ అన్న ఫీల్ వచ్చేంత బాగా వర్కవుటయ్యింది క్లైమాక్స్. మొత్తం కథంతా విన్న నాగేశ్వరరావు గారు "బాగుందయ్యా ....కానీ ,హీరో చచ్చిపోడం బాలేదు మార్చు" అన్నారు. మొదట్నుంచీ వాళ్ళ సినిమాలకి అసిస్టెంట్ గా పనిచెయ్యడమే గాకండా, వాళ్ళింట్లో ఒకడిగా కలతిరగడం వల్ల నాగేశ్వరరావు గారితో బోలెడు చనువుంది నాకు. దాంతో కొంచెం చిరాగ్గానే "హీరోని బతికించడం చేస్తే ,కధ ప్రీ క్లైమాక్స్ నుంచీ మార్చుకుంటా రావాలి'' అన్నాను."మార్చు ...నాకు మాత్రం హీరో బతకాలి ‘'అన్నారు .

కొత్త క్లైమాక్స్ :

కొత్త క్లైమాక్స్ :

చిరాకు పెరిగిపోయిన నేను ‘'మీరే చెప్పండి ఎలా మార్చాలో" అన్నాను. "ఏంటయ్యా .... ఆ పౌరుషం హీరో చచ్చిపోతేనే గొప్ప క్లైమాక్స్ అవ్వుద్దా ?.... సిరిసిరిమువ్వ చూడు కావాలంటే!" అన్నారు. ఎన్ని రాత్రుళ్ళు ,పగళ్ళు ఆలోచించినా ఫస్ట్ టైం రాసిన క్లైమాక్స్ లా రావడం లేదు.అసలు స్క్రిప్టులో నాకు నచ్చిందే ఆ క్లైమాక్స్. కానీ , నేను నొచ్చుకున్నా పర్లేదు నాగేశ్వరరావు గార్ని నొప్పించ కూడదు అనుకుంటా ఆవేళ అనుకున్నకొత్త క్లైమాక్స్ పేపర్ మీద పెట్టి, మర్నాడు ఆఫీసు కెళ్ళి ఆయనకి చెపితే బాగుందన్నారు.

భానుప్రియ:

భానుప్రియ:

‘'హీరోయిన్ గా ఎవర్ని అనుకుంటున్నావయ్యా?''అడిగేరు నాగేశ్వరరావుగారు. ‘'నేను రాసుకున్న కేరెక్టర్ కి రాధ సరిపోద్దండి''అన్నాను. మర్నాడు ఆ రాధ గురించి ఎంక్వయిరీ చేయించిన నాగేశ్వరరావుగారు ‘'లక్షరూపాయిలఒటయ్యా.... మన బడ్జెట్ అంతలేదు గదా.... పదివేలిద్దాం ఎవరైనా కొత్తమ్మాయిని చూడు'' అన్నారు. ఆవేళ పొద్దుట పొడుగాటి ఫ్రాక్ లాంటిదేసుకుని ఆఫీస్ కొచ్చిన ఒకమ్మాయి నల్లగావుంది, పెద్ద కళ్ళు. "పేరేంటి?'' అన్నాను.
"భానుప్రియ''

అసలు పేరు మంగ భాను:

అసలు పేరు మంగ భాను:

‘'ఇది నీ అసలు పేరయ్యుండదే'' "ఔను...ఈ పేరు తమిలోళ్ళు పెట్టేరిది ......నా అసలు పేరు మంగ భాను''
"రేపు ఫోటో సెషన్ పెడదాం'' అని భానుప్రియకి ప్రోగ్రాం చెప్పి పంపేశాక ‘'రేపు ఆ అమ్మాయికి కట్టడానికి బట్టలేంటి''అనుకుంటుంటే ....మొన్న తీసిన సాగర సంగమం లో జయప్రదకి వాడిన చీరలున్నాయిగదా అవి వాడెయ్యండి పర్లేదు''అన్నారు నాగేశ్వరరావు గారు. కాస్టుమ్స్ బాక్స్ లు ఓపెన్ చేస్తుంటే వాటిల్లోంచి బయటికి లాగిన చీరల్లో , గులాబిరంగు చీరొకటి బాగుంది తక్కిన వాటితో పాటు దీనిక్కూడా మేచింగ్ జాకెట్ కుట్టమన్నాను కాస్ట్యూమ్స్ సూర్రావు గార్ని.

మెల్ల పెసున్గల్ అనే తమిళ్ సినిమా:

మెల్ల పెసున్గల్ అనే తమిళ్ సినిమా:

మర్నాడు ఈ కొత్తమ్మాయి భానుప్రియకి మేకప్ వేస్తున్నాడు ముండూరి సత్యం అక్కడికొచ్చి నిలబడ్డ నేను "మరి హీరో వేషానికనుకున్న సుమన్ రావడం లేదాండీ'' అన్నాను "అతనికి విజయా గార్డెన్స్ లో దేశంలో దొంగలు పడ్డారు అనే సినిమా షూటింగ్ ఉందంట, మధ్యాన్నం తర్వాతొదులుతామన్నారా ప్రొడక్షన్ వాళ్ళు'' అన్నారు నాగేశ్వరరావు గారు. "సరేమరి'' అనుకుంటా పనిలోకి దిగిన మేం , నాగేశ్వరరావు గారింటి పక్కనే మలయాళీ సింగర్ మధురి గారింటి డాబా మీద ఖాళీగా ఉంటే దానిమీద మొదలెట్టాం.సినిమా షూటింగ్ లాగే చాలా ఇన్వాల్వ్ అయ్యి చేస్తుంటే లైటింగ్ చేస్తున్నాడు కెమెరామేన్ రఘు. ఆ కొత్తమ్మాయి క్లోజప్పులు తీస్తున్నప్పుడడిగేను. "ఇంతకుముందు ఎవన్నా సినిమాల్లో చేసావా?''అని. "మెల్ల పెసున్గల్ అనే తమిళ్ సినిమాలో చేసేను''అంది.

విశాల నేత్రాలంటే అవే:

విశాల నేత్రాలంటే అవే:

సత్యనారాయణ పట్టుకొచ్చిన కాంటాక్ట్ ప్రింట్స్ లోంచి బ్లోఅప్ చెయ్యాల్సిన ఫ్రేములు మార్క్ చేసి కలర్ ప్రింట్స్ వేసే 7 స్టార్స్ క్రిష్ణకిచ్చాం.పెద్ద సైజు ప్రింట్లు వచ్చాయి.ఆ అమ్మాయిది ఫొటోజెనిక్ ఫేస్. విశాల నేత్రాలంటే అవే అనిపించాయినాకు. అందరికీ బాగుందా మనిషి . ఈలోగా ఏదో పనుండి అక్కడికొచ్చిన మా గురువు కె. విశ్వనాథ్ గారు ఆ ఫోటోలు చూసి ‘'బావుందోయ్ ‘' అన్నారు.కాస్త దూరంగా తలుపు దగ్గర నిలబడ్డ ఏడిద నాగేశ్వరరావుగారి భార్య జయలక్ష్మిగారు ‘కొంచెం మెల్ల ఉందిగదండీ'' అన్నారు.‘'మెల్ల ఉంటే అదృష్టం గదమ్మా ?'' అన్నారు విశ్వనాధ్ గారు.

హీరొయిన్ నువ్వే:

హీరొయిన్ నువ్వే:

ఆయనెళ్ళాక "ఆ అమ్మాయిని పిల్చిమనం కన్ఫర్మ్ చేసుకున్నట్టు చెప్పండి వంశీ'' అన్నారు నాగేశ్వరరావు గారు.
సాయంత్రం కబురుచేస్తే వచ్చిన భానుప్రియతో "మా సినిమాలో హీరొయిన్ నువ్వే" అన్నాను.చాలా సంబర పడ్డ ఆ భానుప్రియ "చాలా థాంక్సండి ఒక సారి డైరెక్టర్ గారిని పిలిస్తే ఆయనక్కూడా థాంక్స్ చెప్పి వెళతాను''అంది . "నేనే డైరెక్టర్ ని" అన్నాను. "అదేంటి విశ్వనాథ్ గారు కాదా ? ఈ కంపెనీ సినిమాలన్నింటికీ ఆయనే కదా డైరెక్టరు?'' అంది.

పెద్ద పెద్ద కళ్ళు:

పెద్ద పెద్ద కళ్ళు:

హీరోయిన్ గా ఆ భానుప్రియ ఫైనలైజ్ అయింది గానీ , నా మహల్లో కోకిల నవలలో అయితేనేం , సినిమా స్క్రిప్టులో నయితేనేం , నేను రాసుకున్న కథానాయిక రూపం వేరే...తెల్లగా గిల్లితే పాలుగారినట్టుండే శరీరంతో మిసమిస లాడతా, మెరిసిపోతా ఉంటుంది. నిత్యం కలలు కనే పెద్ద పెద్ద కళ్ళు. ఒక్క కళ్ళు తప్ప , ఓకే చేసుకున్నఈ మనిషిలో ఆ లక్షణాలు లేవుగదా....సరే తనని బట్టి ఇప్పుడు మార్చు కోవాలి అనుకున్నాను.
మిగతా వేషాల్లో సితార అన్నయ్య వేషానికి శరత్ బాబు ,లాయర్ కి జే.వి. .సోమయజులుగారు, దేవదాస్ వేషానికి భానుచందర్, జర్నలిస్ట్ కి శుభలేఖ సుధాకర్ . అనుకుంటే "తక్కినవన్ని ఓకే గానీ ,ఆ దేవదాసు కి శుభలేఖ సుధాకర్నేసి, జర్నలిస్ట్ కి మన రాంబాబు (ఏడిద శ్రీ రాం )నెయ్యి" అన్నారు నాగేశ్వరరావు గారు.

రిలీజయ్యింది:

రిలీజయ్యింది:

మాకు పోటీ సినిమా ఆనందభైరవిలో కామెడి ఉండటం వల్ల మా సినిమా కంటే అది బాగుందన్న టాక్ వచ్చింది గానీ, తర్వాత వారంలో మాది కూడా నిలబడి పోయింది. అట్లూరి పూర్ణ చంద్రరావు గారి ద్వారా ఈ సిన్మా షో నేయించుకు చూసిన అమితాబ్ బచ్చన్ చాలా మెచ్చుకుంటా మర్నాడు పొద్దున ప్రొడ్యూసర్నీ నన్ను కెమరామేన్ని, హీరోయిన్ని, తాజ్ కోరమండల్ హోటల్లో బ్రేక్ ఫాస్ట్ కి పిల్చినప్పుడు నాకిష్టమైన జయబాధురితో ఎక్కువ మాటాడేను.హిందీలో చేస్తావా అని భానుప్రియని అడిగేరు అమితాబ్ బచ్చన్. శ్రీదేవిని పెట్టి హిందీలో చేసే ప్రపోజల్ తీసుకొచ్చారో నిర్మాత. కానీ, వేరే కారణాల వల్ల వర్కవుటవ్వలేదు.

అవార్డ్ విన్నర్స్ ఫ్లైట్:

అవార్డ్ విన్నర్స్ ఫ్లైట్:

ఈ సిన్మా రష్యన్ భాషలోకి డబ్ అయ్యింది.స్టేట్ అవార్డ్స్ అన్నీ ఆనంద భైరవి కెళ్ళిపోయాయి. "మనకి ఏ అవార్డు రాలేదు.....శంకరాభరణం తీసిన కంపెనీ మనది''అని నాగేశ్వరరావు గారు తెగ ఫీలయిపోయారు. అక్కడే ఉన్న వాళ్ళ ఆఖరబ్బాయి రాజా ‘'మనమో తప్పు చేశాం డాడీ .... క్లైమాక్స్ తీసేసి అవార్డ్స్ కి పంపించాం......ఈ సారి సెంట్రల్ అవార్డ్స్ కి పంపేటప్పుడు ఏ ట్రిమ్మింగు చెయ్యకండా పంపిద్దాం''అని అలాగే చేసాడు.
నేషనల్ అవార్డ్స్ అనౌన్స్ అయ్యాయి. వెన్నెల్లో గోదారి అందం పాడిన జానకి గారికి బెస్ట్ ఫిమేల్ సింగర్ అవార్డు, ఎడిటర్ అనిల్ మల్నాడ్ కి బెస్ట్ ఎడిటర్ అవార్డ్ , సినిమాకి బెస్ట్ రీజనల్ ఫిల్మ్ అవార్డు వచ్చాయి. ఆ ఉదయం మీనం బాక్కం ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరిన ఆ ఫ్లైట్లో అందరూ అవార్డ్ విన్నర్సే. దాంతో అంతా కల్సి దానికి అవార్డ్ విన్నర్స్ ఫ్లైట్ అని పేరు పెట్టారు.

మీ దగ్గర అసిస్టెంట్ గా పని చేద్దామని :

మీ దగ్గర అసిస్టెంట్ గా పని చేద్దామని :

మాలాగే రీజనల్ అవార్డ్ సంపాదించిన తమిళ్ సినిమా "ఆచమిల్లై ..అచ్చమిల్లై ‘'దర్శకుడు కె. బాలచందర్ గారు ఫ్లైట్ లో నా పక్కన కూర్చుంటా నన్ను పలకరించేరు. కంగారు పడిపోయిన నేను లేచి నిలబడి "మీ దగ్గర అసిస్టెంట్ గా పని చేద్దామని చాన్నాళ్ళ పాటు మీ ఇంటి గేటు దగ్గర నిలబడ్డాను గానీ, మీ నేపాలీ ఘూర్కా లోపలికి వెళ్ళనియ్యలేదు సర్" అన్నాను.

ప్రెసిడెంట్ అఫ్ ఇండియా తో:

ప్రెసిడెంట్ అఫ్ ఇండియా తో:

నవ్వేసిన ఆయన "మనమిలా కలిసి అవార్డ్స్ తీసుకోడానికెళ్ళాలని రాసి పెట్టుంటే, నా దగ్గర కెలా రానిస్తాడా దేవుడు చెప్పు ?'' అంటా నన్ను ఆశీర్వదించిన ఆ దర్శక మేధావి పక్కన కూర్చోబెట్టింది సితార. నాకు ప్రాణమైన నా గురువు భారతీరాజాతో నాగురించి మాట్లాడించింది సితార. ప్రెసిడెంట్ అఫ్ ఇండియా తో కరచాలనం చేయించింది సితార. ఇంకా ఎందర్నో .ఎన్నో విధాలుగా నాకు దగ్గర చేసిన సితార ఏ వెన్నెల వేడికీ వాడిపోని పరిమళించే జ్ఞాపకం ఐపోయింది......
ఎంత పని చేసింది ‘'మహల్లో కోకిల'' నవల???

English summary
Yesteryear heroine Bhanupriya has recently revealed in an interview that she got marriage proposal from then top director Vamsi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu