»   » భరత్ బహిరంగ సభ లైవ్.. అందరి కళ్లూ ప్రిన్స్ మహేష్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ పైనే

భరత్ బహిరంగ సభ లైవ్.. అందరి కళ్లూ ప్రిన్స్ మహేష్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ పైనే

Subscribe to Filmibeat Telugu
Jr NTR, Ram Charan As Chief Guests For The Pre-Release Event Of ‘Bharat Ane Nenu’?

మహేష్ బాబు నటిస్తున్న భరత్ అనే నేను చిత్రంపై ఆకాశాన్ని ఆకాశాన్ని తాకే అంచనాలు ఉన్నాయి. శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ విజయం తరువాత కొరటాల శివ, మహేష్ బాబు సూపర్ హిట్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఇదే. దీనితో మహేష్ ఫాన్స్ ఈ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకుని ఉన్నారు. భరత్ అనే నేను చిత్రంలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.

మహేష్ బాబు ఈ చిత్రంలో రాజకీయ నాయకుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడు. దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని ఉత్కంఠ భరిత పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో బిగ్ ఈవెంట్ నేడు  జరగుతున్నది. భరత్ బహిరంగ సభ పేరుతో ఎల్బీ స్టేడియంలో భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. 

 భరత్ బహిరంగ సభ

భరత్ బహిరంగ సభ

భరత్ అనే నేను చిత్రం ఏప్రిల్ 20 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విడుదల సమయం దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలపై దృష్టి పెట్టింది. ఈ సందర్భంగా నేడు(శనివారం) చిత్ర యూనిట్ భరత్ భహిరంగ సభ పేరుతో భారీ ఈవెంట్ నిర్వహించనుంది.


 అతిధిగా ఎన్టీఆర్

అతిధిగా ఎన్టీఆర్

గత కొన్ని రోజులుగా భరత్ బహిరంగ సభకు జూనియర్ ఎన్టీఆర్ మరియు రాంచరణ్ అతిధులుగా వస్తుంటానే వార్తలతో దీనిపై అభిమానుల్లో అటెన్షన్ పెరిగింది. కానీ ఎన్టీఆర్ మాత్రమే ఈ ఈవెంట్ కు అతిధిగా వస్తున్నాడు.


వాళ్ళిద్దరిపైనే అందరి చూపు

వాళ్ళిద్దరిపైనే అందరి చూపు

ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్, మహేష్ బాబు ఎలా వేదిక పంచుకుంటారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొని ఉంది. మహేష్ సినిమా ఈవెంట్ కు ఎన్టీఆర్ హాజరవుతుండడంతో ఊహించిన స్థాయి కంటే ఎక్కువగా అభిమానుల తాకిడి కనిపిస్తోంది.


భరత్ ప్రత్యేకతలు

భరత్ ప్రత్యేకతలు

మహేష్, కొరటాల సూపర్ హిట్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. మహేష్ బాబు ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడు. ఆసక్తికర పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ నటిస్తున్న తొలి తెలుగు చిత్రం ఇదే కావడం విశేషం.


మహేష్ లుక్స్ అదుర్స్

మహేష్ లుక్స్ అదుర్స్

ఈ చిత్రంలో మహేష్ బాబు లుక్స్ అభిమానులని తెగ ఆకట్టుకుంటున్నాయి. మహేష్ స్టైలిష్ ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడు. ఆ మధ్యన విడుదలైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.


English summary
Bharat Ane Nenu big event Bharat Bahiranga sabha today. NTR is the chief guest for the event
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X