»   » ట్రయల్ షో రిపోర్ట్: ‘భరత్ అనే నేను’ టెర్రిఫిక్... రికార్డులన్నీ ఊడ్చేయడం ఖాయం!

ట్రయల్ షో రిపోర్ట్: ‘భరత్ అనే నేను’ టెర్రిఫిక్... రికార్డులన్నీ ఊడ్చేయడం ఖాయం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'భరత్ అనే నేను'. డివివి ఎంటర్టెన్మెంట్స్ నిర్మించిన ఈ భారీ చిత్రం ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం ప్రింట్ చెక్ చేయడం కోసం ట్రయల్ షోలు వేస్తున్నారు. ఇటీవల ఫైనల్ ట్రయల్ షో వేయగా మహేష్ బాబు కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఈ సినిమా చూసినట్లు తెలుస్తోంది.

Bharat Ane Nenu First Copy Report Biggest Hit Ever
 టెర్రిఫిక్ రిపోర్ట్స్

టెర్రిఫిక్ రిపోర్ట్స్

ట్రయల్ షో నుండి వస్తున్న రిపోర్ట్స్ టెర్రిఫిగా ఉన్నాయి. మహేష్ బాబు కెరీర్ బెస్ట్ మూవీ అవుతుందని అంటున్నారు. పొలిటికల్ ఎంటర్టెనర్‌గా రూపొందుతున్న ఈచిత్రంలో మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నారు. మహేష్ బాబు ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చేశారు. కానీ ఏ సినిమాలోనూ రాజకీయ నాయకుడిగా నటించలేదు. ఆయన చేస్తున్న తొలి పొలిటికల్ మూవీ ఇది. ఇందులో మహేష్ బాబు సరికొత్త పెర్ఫార్మెన్స్ చూడబోతున్నామని, ఆయన కెరీర్లోనే ది బెస్ట్ అనే విధంగా ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేశాడని టాక్.


 కొరటాల మరోసారి అదరగొట్టాడు

కొరటాల మరోసారి అదరగొట్టాడు

కట్టి పడేసే కథ, కథనంతో కొరటాల శివ మరోసారి తన రైటింగ్ స్కిల్స్ అద్భుతంగా ప్రదర్శించారని, ఉత్కంఠ భరితంగా ఈ సినిమాను తెరకెక్కించారని అంటున్నారు. అతడు బేసిగ్గా రైటర్ కావడంతో స్క్రిప్టు అద్భుతంగా వచ్చిందనే ప్రశంసలు వినిపిస్తున్నాయి.


 రికార్డులన్నీ ఊడ్చేసే సత్తా ఉన్న మూవీ

రికార్డులన్నీ ఊడ్చేసే సత్తా ఉన్న మూవీ

గతంలో మహేష్ బాబు-కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన శ్రీమంతుడు మూవీ సంచలన విజయం సాధించింది. అయితే ఈ సారి ‘భరత్ అనే నేను' అంతకు మించిన హిట్ అవుతుందని, టాలీవుడ్లో ఇప్పటి వరకు ఉన్న నాన్ బాహుబలి రికార్డులను ఊడ్చేసే సత్తా ఉన్న సినిమా అని అంటున్నారు.


ఉమైర్ సంధు ట్వీట్

ఉమైర్ సంధు ట్వీట్

యకె/యూఏఈలో సెన్సార్ బోర్డ్ మెంబర్‌గా ఉన్న ఉమైర్ సంధు ‘భరత్ అనే నేను' సినిమా గురించి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించి ఫైనల్ ట్రయల్ పూర్తయింది. వాటి ద్వారా వస్తున్న రిపోర్ట్స్ టెర్రిఫిక్‌గా ఉన్నాయి. మహేష్ బాబు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సినిమా చూశారు. అద్భుతమైన కథతో సినిమా ఆకట్టుకుంటుందని, మహేష్ బాబు కెరీర్లోనే ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని అంతా పొగిడేస్తున్నారు. నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టే పొటెన్షియల్ ఉన్న సినిమా ఇది అంటూ ట్వీట్ చేశారు.


ఎంటర్టెన్మెంట్ మిస్సవ్వకుండా

ఎంటర్టెన్మెంట్ మిస్సవ్వకుండా

పొలిటికల్ నేపథ్యం అనగానే సీరియస్ సాగే మూవీ అనుకోవద్దని... దాంతో పాటు హాస్యం, ప్రమకథ, యాక్షన్ ఇలా అన్నీ సమపాళ్లలో జోడించి ప్రేక్షకులు పూర్తి స్థాయిలో సంతృప్తిపడేలా ఉంటుందని, ఈ చిత్రానికి సంగీతం, సినిమాటోగ్రఫీ హైలెట్‌గా ఉంటుందని చిత్ర బృందం వెల్లడించారు.


English summary
"BREAKING NEWS of the day !! Final Trial Show Reports of #BharatAneNenu are TERRIFIC ! As per #MaheshBabu Family Friends, It has Watertight Story & his Best Performance !! It has Potential to break all Non #Baahubali Records!" Umair Sandhu tweets.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X