twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రీమియర్ షో టాక్: భరత్ అనే నేను.. పండగ చేసుకునే సినిమా, ఆ సీన్స్ పిచ్చెక్కిస్తాయి!

    |

    సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం కోసం అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ, మహేష్ సూపర్ హిట్ కాంబినేషన్లో ఈ చిత్రం రాబోతుండడమే ఇందుకు కారణం. కొరటాల మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ వంటి చిత్రాలతో టాలీవుడ్ లో తిరుగులేని డైరెక్టర్ గా మారాడు. దీనితో భరత్ అనే నేను చిత్రం పైకూడా అంచనాలు పెరిగాయి. మహేష్ బాబు ఈ చిత్రంలో ముఖ్యమంత్రిగా కనిపించబోతుండడంతో ఫ్యాన్స్ లో ఉత్కంఠ పెరిగిపోయింది. బాలీవుడ్ భామ కైరా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండడం మరో ఆకర్షణ. ఇన్ని పాజిటివ్ అంశాల నడుమ భరత్ అనే నేను చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే యూఎస్ లో ప్రదర్శించబడిన షో లనుంచి బ్లాక్ బాస్టర్ రిపోర్ట్స్ వస్తున్నాయి.

    Recommended Video

    Bharath Ane Nenu : Mahesh Koratala Interview With Pradeep
    20 నిమిషాల లోపే

    20 నిమిషాల లోపే

    సినిమా ప్రారంభమైన 20 నిమిషాల లోపే మహేష్ బాబు ముఖ్యమంత్రి అయిపోతాడు. విదేశాల్లో ఉత్తమైన చదువులు చదువుకున్న కుర్రాడిగా మహేష్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తాడు. మహేష్ బాబు లుక్స్ అదిరిపోయాయి.

    పాటల చిత్రీకరణ

    పాటల చిత్రీకరణ

    ఫస్ట్ హాఫ్ లో వచ్చే రెండు పాటలు చాలా బావున్నాయి. నిర్మాణ విలువలు ఈ చిత్రంలో ఎంత రిచ్ గా ఉన్నాయో సాంగ్స్ తో అర్థం అవుతుంది. ముఖ్యంగా ఐ డోంట్ నో సాంగ్ చిత్రికరణ చాలా బావుంది. ఆ తరువాత వచ్చే టైటిల్ సాంగ్ భరత్ అనే నేను కూడా ఆకట్టుకుంటుంది.

    అసెంబ్లీ సన్నివేశాలు అచ్చం అలాగే

    అసెంబ్లీ సన్నివేశాలు అచ్చం అలాగే

    భరత్ అనే నేను చిత్రంలో అసెంబ్లీ సన్నివేశాలు ఆకట్టుకోవడం ఖాయం. అచ్చం తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ మాదిరిగానే ఉంటూ మంచి హాస్యంతో ఆకట్టుకున్నారు.

    కైరా అద్వానీతో అందమైన సన్నివేశాలు

    కైరా అద్వానీతో అందమైన సన్నివేశాలు

    మహేష్, కైరా అద్వానీ మధ్య సన్నివేశాలని దర్శకుడు చాలా అందంగా చిత్రీకరించాడు. కైరా అద్వానీ గ్లామర్ పరంగా కూడా ఆకట్టుకుంది.

    ఫస్ట్ హాఫ్ సూపర్

    ఫస్ట్ హాఫ్ సూపర్

    మొత్తంగా ఫస్ట్ హాఫ్ మొత్తం ఆకట్టుకునేలా సాగుతుంది. మహేష్ బాబు లుక్స్ పరంగా ఈ చిత్రంలో కెరీర్ బెస్ట్ అనే విధంగా కనిపించాడు. అసెంబ్లీ సన్నివేశాలు, ఆకట్టుకునే పొలిటికల్ డ్రామా ఫస్ట్ హాఫ్ లో హైలైట్ గా నిలిచాయి.

    రాయలసీమలోకి రాజసంగా

    రాయలసీమలోకి రాజసంగా

    సెకండ్ హాఫ్ లో మహేష్ బాబు హెలికాఫ్టర్ ద్వారా రాయలసీమకు చేరుకునే సన్నివేశం చూస్తే అభిమానులకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆ సన్నివేశాలో మహేష్ ని అద్భుతంగా చూపించారు.

    ఆ ఫైట్ గురించి ప్రత్యేకంగా

    ఆ ఫైట్ గురించి ప్రత్యేకంగా


    భరత్ అనే నేను చిత్రంలో మరో ప్రధాన ఆకర్షణగా మారిన దుర్గమహల్ ఫైట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ప్రతి షాట్ మహేష్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా దర్శకుడు చిత్రికరించారు. మహేష్ బాబు కెరీర్ లో ఈ ఫైట్ ప్రధమ స్థానంలో ఉంటుంది అనడంలో సందేహం లేదు.

    సెకండ్ హాఫ్ అదిరిపోయింది

    సెకండ్ హాఫ్ అదిరిపోయింది

    దుర్గమహల్ ఫైట్ సీన్, మహేష్ బాబు ప్రెస్ మీట్ సెకండ్ హాఫ్ లో హైలైట్ అయిన ప్రధాన అంశాలు. మొత్తంగా భరత్ అనే నేను చిత్రం అంచనాలని అందుకునేలా ఉంది. కమర్షియల్ కమర్షియల్ ఎలిమెంట్స్, సోషల్ మెసేజ్ ఇలా అన్ని ఈ చిత్రం దర్శకుడు సమపాళ్లలో పొందుపరిచారు. భారత అనే నేను చిత్రం కలెక్షన్ల సునామి సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

    English summary
    Bharat Ane Nenu premier show talk. Blockbuster reports from all over
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X