»   » భరత్ అనే నేనుతమిళ వర్షన్ విడుదల తేదీ ఖరారు!

భరత్ అనే నేనుతమిళ వర్షన్ విడుదల తేదీ ఖరారు!

Subscribe to Filmibeat Telugu

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం ఘనవిజయం సాధించింది. మహెష్ కెరీర్ లో ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మహేష్, కొరటాల సూపర్ హిట్ కాంబినేషన్ మ్యాజిక్ మరో మారు రిపీట్ అయింది. శ్రీమంతుడు చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే.

పూర్తి స్థాయి రాజకీయ చిత్రంలో మహేష్ నటించడం ఇదే తొలిసారి. ముఖ్యమంత్రిగా మహేష్ కనబరిచిన నటన అందరిని ఆకట్టుకుంది. రాజకీయ వ్యవస్థలో ఉన్న లోపాలు, విద్య, వైద్యం, ట్రాఫిక్ వంటి సమస్యలని దర్శకుడు కొరటాల ఈ చిత్రంలో ఎత్తి చూపారు.

 Bharat Ane Nenu Tamil version release date confirm

భరత్ అనే నేను చిత్రం విజయం సాధించడంతో పరభాషల్లోకి కూడా అనువాదంచేస్తున్నారు. మొదటగా తమిళంలో ఈ చిత్రాన్ని డబ్ చేసి విడుదల చేయబోతున్నారు. తమిళ వర్షన్ విడుదలకు తేదీ ఖరారైంది. ఈ నెల 25 న భరత్ అనే నేను చిత్రం 'భరత్ యనుమ్ నాన్' పేరుతో తమిళంలో విడుదల కాబోతోంది. కాగా భరత్ అనే నేను చిత్రంలో చెన్నైలో మంచి వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. రూ 1.65 కోట్ల షేర్ ని ఈ చిత్రం చెన్నై, తమిళనాడు వ్యాప్తంగా రాబట్టింది.

English summary
Bharat Ane Nenu Tamil version release date confirm. Bharat Ane Nenu is huge hit in Tollywood
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X