భరత్ బహిరంగ సభ లైవ్: నిజాయితీతో కూడిన అద్భుతం.. రామజోగయ్య శాస్త్రి
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న భరత్ అనే నేను చిత్రం ఏప్రిల్ 20 న ప్రేక్షుకుల ముందుకు రాబోతోంది. కాగా నేడు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో భరత్ బహిరంగ సభతో భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ ప్రారంభం అయింది వరుసగా ప్రముఖులు ప్రసంగిస్తున్నారు. ఈ చిత్రానికి లిరిక్స్ అందించిన గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడారు.
రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. భరత్ అనే నేను చిత్రం నిజాయతీతో కూడిన అద్భుతం అని అన్నారు. కొద్ది సేపటి క్రితమే విడుదలైన జ్యూక్ బాక్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందని అన్నారు. ఈ చిత్ర దర్శకుడు కొరటాల శివ ఆలోచనలు ఎంత విభిన్నంగా ఉంటాయో తనకు తెలుసు అని అన్నారు. పోస్టర్స్, టీజర్ రూపంలో మీరు చూసింది చాలా తక్కువ మాత్రమే అని అన్నారు.
చూడాల్సింది చాలా ఉందని అన్నారు. తనతో దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ ఎప్పుడూ సూపర్ హిట్టే అని అన్నారు. పరభాషా గాయకులతో పాడించినప్పటికీ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్ర పాటల కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారని అన్నారు. 'వచ్చాడయ్యో' సాంగ్ వెండి తెరపై ఓ అద్భుతం అని అన్నారు. ఆ పాట నభూతో నభవిష్యతి అన్నట్లుగా ఉంటుందని రామజోగయ్య శాస్త్రి తెలిపారు. చిత్ర యూనిట్ కు కృతజ్ఞతలు తెలియజేస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.


Click it and Unblock the Notifications











