»   » మహేష్ బాబు కాబట్టి ఒప్పుకున్నాను, పెద్ద డైలాగులు చెప్పాల్సి వచ్చేది: "ప్రేమిస్తే" భరత్

మహేష్ బాబు కాబట్టి ఒప్పుకున్నాను, పెద్ద డైలాగులు చెప్పాల్సి వచ్చేది: "ప్రేమిస్తే" భరత్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాయ్స్‌', 'ప్రేమిస్తే' లాంటి చిత్రాలతో తెలుగులో కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు తమిళ హీరో భరత్‌. తాజాగా, ఓ స్టైట్ తెలుగు చిత్రంలో అతడు విలన్‌గా నటిస్తున్నాడు. ప్రిన్స్ మహేష్ బాబు, మురగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'స్పైడర్‌' లో ప్రతినాయకుడిగా భరత్‌ నటిస్తున్నాడు.

మహేష్ సినిమా అని తెలియగానే

మహేష్ సినిమా అని తెలియగానే

‘స్పైడర్' ఫస్ట షెడ్యూల్ పూర్తైన తర్వాత మురగాదాస్ తనకు ఫోన్ చేశారని.. క్యారెక్టర్ నచ్చడంతో పాటు మహేష్ సినిమా అని తెలియగానే ఓకే చెప్పేశానన్నాడు. మురుగదాస్ ఒక రోజు ఫోన్ చేసి మహేశ్ బాబుకు దీటుగా ఉండే విలన్ పాత్ర కోసం చూస్తున్నానని చెప్పారు.

వెంటనే ఓకే చెప్పేశాను

వెంటనే ఓకే చెప్పేశాను

స్పైడర్‌లో విలన్ పాత్ర గురించి పూర్తిగా చెప్పారు. ఆ పాత్ర నాకు చాలా బాగా నచ్చింది. ఇక మురుగదాస్ గారితో కలిసి పని చేయటానికి ఇంతకంటే మంచి చాన్స్ రాదనిపించింది. వెంటనే ఓకే చెప్పేశాను. ఎలాగో ప్రేమిస్తే సినిమాతో నేను తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్నవాడినే.

Mahesh Babu's Spyder teaser creates record
అదృష్టంగా భావిస్తున్నాను

అదృష్టంగా భావిస్తున్నాను

కానీ అది డబ్బింగ్ సినిమా. తెలుగులో మహేశ్ బాబు లాంటి స్టార్‌ సినిమాతో ఎంట్రీ ఇచ్చే అవకాశం రావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. మహేశ్ బాబు నుంచి చాలా నేర్చుకున్నాను. అంత స్టార్ హీరో అయి ఉండి కూడా ఆయన ఎదుటి వారికిచ్చే గౌరవం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది.

మహేశ్ తమిళ్ స్పష్టంగా మాట్లాడతాడు

మహేశ్ తమిళ్ స్పష్టంగా మాట్లాడతాడు

స్పైడర్ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతున్నందు వల్ల ప్రతీ సీన్‌‌ను రెండు భాషల్లో చిత్రీకరించాల్సి వచ్చేది. అయినా ఆయన చాలా కూల్‌గా ఉండేవాడు. మహేశ్ తమిళ్ స్పష్టంగా మాట్లాడతాడు. నాకు తెలుగు సరిగా రాదు. కొన్ని పెద్ద డైలాగ్స్‌ను నేను తెలుగులో చెప్పాల్సి వచ్చేది.

నాకూ, మహేశ్‌కు మధ్య వచ్చే సీన్స్‌

నాకూ, మహేశ్‌కు మధ్య వచ్చే సీన్స్‌

కొంచెం ఇబ్బంది పడేవాడిని. అయినా సరే మహేశ్ ఓపిగ్గా ఎదురుచూసేవాడు. మురుగదాస్ గారి గురించి చెప్పాల్సి వస్తే ఆయన తనకు ఏం కావాలో రాబట్టుకోవడంలో దిట్ట. స్క్రీన్‌ప్లే వివరించడంలో మురుగదాస్ మాస్టర్ లాంటివాడు. ఎస్‌జె సూర్య నెగిటివ్ రోల్ పోషిస్తున్నారు. నాకూ, మహేశ్‌కు మధ్య వచ్చే సీన్స్‌ను 25రోజుల్లో చిత్రీకరించారు.

హిస్టరీలో ఇదో బెస్ట్ మూవీ అవుతుంది

హిస్టరీలో ఇదో బెస్ట్ మూవీ అవుతుంది

ఇండియన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్‌ హిస్టరీలో ఇదో బెస్ట్ మూవీ అవుతుంది. లన్‌గా ఇదే తన తొలి మరియు ఆఖరి చిత్రమని.. ఇకపై ఎవరైనా విలన్‌గా నటించమని అడిగినా వెంటనే ‘నో' చెప్పేస్తానని, తాను హీరోగానే కొనసాగాలనుకుంటున్నానని కేవలం మహేష్ బాబు కోసమే ఈ సినిమాలో విలన్‌గా నటించడానికి ఒప్పుకున్నానని భరత్ తెలిపాడు.

English summary
Actor Bharath of Premisthe fame is doing a negative role for the first time in his career, courtesy of Mahesh Babu's Spyder .
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu