»   » మహేష్ బాబు మూవీ టైటిల్ అదే: దేవిశ్రీ ప్రసాదే సాక్షి!

మహేష్ బాబు మూవీ టైటిల్ అదే: దేవిశ్రీ ప్రసాదే సాక్షి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: శ్రీమంతుడు లాంటి భారీ హిట్ తర్వాత మహేష్ బాబు-కొరటాల శివ కాంబినేషన్లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ విషయంలో ఓ క్లారిటీ వచ్చేసింది.

ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజింగ్స్ జరుగుతున్న విషయాన్ని తెలియజేస్తూ.... ఇందులో సినిమా టైటిల్ ను 'భరత్ అను నేను'గా పేర్కొన్నారు. దీంతో మహేష్-కొరటాల మూవీ టైటిల్ ఇదే అని తేలిపోయింది.

భరత్ అనే నేను

భరత్ అనే నేను

స్వయంగా దేవిశ్రీ ప్రసాద్ ట్వీట్ చేయడంతో ఈ సినిమాకు ‘భరత్ అనే నేను' అనే టైటిల్ ఫిక్స్ చేస్తారని స్పష్టమవుతోంది. ఇదే టైటిల్ తో త్వరలో ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసే అవకాశం ఉంది.

కొరటాల, దేవి

కొరటాల, దేవి

కొరటాల, దేవిశ్రీ కలిసి ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ బిజీగా ఉన్నారు. తమకు నచ్చిన విధంగా, మహేష్ అభిమానులు, ప్రేక్షకులు మెచ్చే విధంగా ఈ పాటల కంపోజింగ్ జరుగుతోందట. రెండు మెలొడీ సాంగ్స్, రెండు మాస్ సాంగ్స్, ఓ ఐటం సాంగ్ కంపోజ్ చేస్తున్నట్లు సమాచారం.

దానయ్య

దానయ్య

డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బేనర్‌పై సూపర్‌హిట్‌ చిత్రాల నిర్మాత డి.వి.వి.దానయ్య ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, సినిమాటోగ్రఫీ: రవి కె.చంద్రన్‌, నిర్మాత: డి.వి.వి.దానయ్య, దర్శకత్వం: కొరటాల శివ.

కొరటాల

కొరటాల

ఈ సందర్భంగా దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ - ''శ్రీమంతుడు లాంటి సూపర్‌ మూవీ తర్వాత మహేష్‌బాబు లాంటి సూపర్‌స్టార్‌తో శ్రీమంతుడు కంటే పవర్‌ఫుల్‌ సబ్జెక్ట్‌తో తీస్తున్న ఈ చిత్రం తెలుగు సినిమా స్థాయిని పెంచే విధంగా వుంటుందని తెలిపారు.

English summary
Bharath Ane Nenu is the title for Prince Mahesh Babu’s movie which is getting framed in the direction successful director Koratala Shiva.Mahesh Babu and Koratala Siva’s combination movie is titled as Bharath Ane Nenu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu