»   » రంగస్థలం, అర్జున్ రెడ్డికి ధీటుగా భరత్ అనే నేను!

రంగస్థలం, అర్జున్ రెడ్డికి ధీటుగా భరత్ అనే నేను!

Posted By: Sreedhar
Subscribe to Filmibeat Telugu

మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా ట్రైలర్ విడుదల అయ్యింది. ఈ ట్రైలర్ లో మహేష్ బాబు చెప్పిన డైలాగ్ బాగా ఫేమస్ అయ్యింది. ''త్వరలోనే మీ అందరినీ మాట మీద నిలబడే మగాళ్లను చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నా'' అంటూ మహేష్ బాబు చెప్పిన లేటెస్ట్ పంచ్ డైలాగ్ మారు మ్రోగుతోంది.

భరత్ అనే నేను సినిమలో ఇటువంటి డైలాగ్స్ మరెన్నో ఉన్నాయని చిత్ర దర్శకుడు కొరటాల శివ చెబుతున్నాడు. కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో భారి ఫైట్స్, రిచ్ లొకేషన్స్ లో సాంగ్స్ ఉండబోతున్నాయి. ఇటీవల విడుదలైన అన్ని పాటలకు మంచి స్పందన లభించడం సినిమాకు మరో ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు.

bharath ane nenu like arjun reddy and rangasthalam

తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికేట్ లభించింది. సినిమా నిడివి దాదాపు మూడు గంటలు ఉందని తెలుస్తోంది. అర్జున్ రెడ్డి, రంగస్థలం సినిమాలు ఎక్కువ నిడివితో విడుదలై మంచి విజయాలు సాధించడంతో భరత్ అనే నేను సినిమాను కూడా భారి నిడివితో విడుదల చెయ్యబోతున్నారు. ఈ సినిమా ఏ స్థాయి విజయం సాధిస్తుందో తెలియాలంటే ఏప్రిల్ 20 వరుకు ఆగాల్సిందే.

English summary
Mahesh babu bharath ane nenu film all set to grand release on april 20. the film censor done today. movie gog u/a certificate without any cuts. and the film run time was nearly 3 hours.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X