»   » భావన, నవీన్ రిసెప్షన్.. తరలివచ్చిన సినీతారలు.. (ఫొటోలు)

భావన, నవీన్ రిసెప్షన్.. తరలివచ్చిన సినీతారలు.. (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

మలయాళ ముద్దుగుమ్మ భావన, కన్నడ నిర్మాత నవీన్ వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. తమ వివాహానికి సంబంధించిన విందును సోమవారం రాత్రి (22 జనవరి) వైభవంగా నిర్వహించారు. ఈ రిసెస్షన్‌కు మలయాళ, తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖులు తరలివచ్చారు. కన్నుల పండువగా జరిగిన కార్యక్రమానికి బంధువులు, కుటుంబ సభ్యులు భారీ పోటెత్తారు.

రూమర్లకు షాక్.. వైభవంగా భావన, నవీన్ పెళ్లి..!
 పృథ్వీరాజ్ ముందుగానే

పృథ్వీరాజ్ ముందుగానే

భావన, నవీన్ రిసెప్షన్‌కు మలయాళ నటుడు ప‌ృథ్వీరాజ్ సుకుమారన్ ముందుగా తరలివచ్చారు. భావనతో కలిసి సుకుమారన్ పలు మలయాళ చిత్రాల్లో నటించారు. వారి మధ్య మంచి రిలేషన్స్ ఉండటం వలన అందరికంటే ముందు వచ్చి అందర్ని ఆనందంలో ముంచెత్తారు.

 సూపర్‌ స్టార్ మమ్ముట్టి దీవెనలు

సూపర్‌ స్టార్ మమ్ముట్టి దీవెనలు

భావన పెళ్లి రిసెప్షన్‌కు హాజరైన వారిలో సూపర్‌స్టార్ మమ్ముట్టి నవీన్ పౌలీ, అందాల తారలు మంజు వారియర్, నవ్య నాయర్ తదితరులు హాజరయ్యారు. భావన, నవీన్‌కు హృదయపూర్వక అభినందనలు. మీ వివాహా జీవితం చిరకాలం వర్ధిల్లాలి అని నవీన్ పౌలీ ట్వీట్టర్‌లో పేర్కొన్నారు.

 రోమియో షూటింగ్‌లో

రోమియో షూటింగ్‌లో

కన్నడ చిత్రం రోమియో షూటింగ్ సందర్భంగా భావన, నవీన్ మధ్య పరిచయం జరిగింది. రోమియో చిత్రాన్ని నవీన్ నిర్మించారు. ఆ తర్వాత వారిద్దరు ప్రేమించుకొన్నారు. 2017లో భావన, నవీన్ నిశ్చితార్థం జరిగింది.

 గోప్యంగా పెళ్లి కార్యక్రమం

గోప్యంగా పెళ్లి కార్యక్రమం

భావన, నవీన్ పెళ్లి తేదీని చాలా గొప్యంగా ఉంచారు. వారం రోజుల ముందు వరకు కూడా మీడియాకు పొక్కనివ్వలేదు. ఓ దశలో పెల్లి క్యాన్సిల్ అవుతుందనే వార్తలు వినిపించాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య సోమవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో హిందూ సంప్రదాయం ప్రకారం వారిద్దరూ ఒక్కటయ్యారు.

English summary
Bhavana’s wedding reception was attended by the who’s who of Malayalam film industry including Prithviraj and Mammootty. The wedding saw the presence of Bhavana’s close friends including actor Manju Warrier and Navya Nair. Many stars also took to Twitter to wish the couple on the occasion.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu