»   » 'భీమవరం బుల్లోడు' ఆడియో ఫంక్షన్(ఫోటోలు)

'భీమవరం బుల్లోడు' ఆడియో ఫంక్షన్(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: 'పెళ్లికాని పిల్లోడు.. ప్రేమజ్వరం ఉన్నోడు.. భీమవరం బుల్లోడు' అంటూ సాగిన వేడుక భీమవరం పట్టణంలో ఆదివారం పండుగ వాతావరణం నెలకొల్పింది.'భీమవరం బుల్లోడు' సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుక డీఎన్నార్‌ కళాశాలలోని గన్నాబత్తులవారి క్రీడాప్రాంగణంలో వైభవంగా నిర్వహించారు.

ఆంధ్రా అమెరికా అంటే భీమవరమేనని ప్రజలు నిరూపించారని హీరో సునీల్‌ పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో 'భీమవరం బుల్లోడు' పాటల్ని ఆదివారం విడుదల చేశారు.

సునీల్‌, ఎస్తేర్‌ జంటగా నటించిన చిత్రమిది. ఉదయశంకర్‌ దర్శకుడు. సురేష్‌బాబు నిర్మాత. సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ ప్రారంభించి 50 ఏళ్లు అయిన సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. ఇప్పుడు ఆడియో ని ఘనంగా విడుదల చేసారు.

స్లైడ్ షోలో...పంక్షన్ డిటేల్స్...

కేకు కోసి ....

కేకు కోసి ....

సినిమా ఆడియో సీడీలను సునీల్‌, సురేష్‌బాబు ఆవిష్కరించారు. 'భీమవరం బుల్లోడు' ఆడియో పెద్ద హిట్ అవుతుందని అందరూ స్టేజీపై అన్నారు.

నిర్మాత డి.సురేష్‌బాబు మాట్లాడుతూ ....

నిర్మాత డి.సురేష్‌బాబు మాట్లాడుతూ ....


ఈ చిత్రం శతదినోత్సవం చేసుకునేలా ఆశీర్వదించాలని కోరారు. తన సంస్ధ నుంచి 50 ఏళ్లు అయిన సందర్భంగా వస్తున్న చిత్రం అని అన్నారు.

హీరో సునీల్‌ మాట్లాడుతూ....

హీరో సునీల్‌ మాట్లాడుతూ....

తన చిన్నతనంలో ఇదే ప్రాంగణంలో ఎన్టీఆర్‌ను చూసేందుకు వచ్చానని, వర్షం చిత్రం 50వ రోజు వేడుకను తిలకించానని అటువంటి చోట నన్ను చూసేందుకు ఇంత మంది అభిమానులు రావడం చాలా ఆనందాన్నిస్తోందన్నారు.

సునీల్ కంటిన్యూ చేస్తూ..

సునీల్ కంటిన్యూ చేస్తూ..

సునీల్‌ మాట్లాడుతూ ''సురేష్‌ ప్రొడక్షన్‌ సంస్థ 50వ వార్షికోత్సవ వేడుకను భీమవరంలో నిర్వహించడం ఆనందంగా ఉంది. ఈ చిత్రం ఘనవిజయం సాధించేలా ఆశీర్వదించాల''ని విజ్ఞప్తి చేశారు.

హీరోయిన్‌ ఎస్తేరు మాట్లాడుతూ...

హీరోయిన్‌ ఎస్తేరు మాట్లాడుతూ...

చిత్రంలో తన పాత్ర చాలా బాగా డిజైన్ చేసారన్నారు. అలాగే ఆమె చిత్రంలోని గీతాన్ని ఆలపించి ఆహుతులను అలరించారు.

లిరిక్ రైటర్స్ మాట్లాడుతూ..

లిరిక్ రైటర్స్ మాట్లాడుతూ..

సినీగేయ రచయితలు చంద్రబోస్‌, అనంతశ్రీరామ్‌ మాట్లాడుతూ స్వయంకృషికి సునీల్‌ నిదర్శనమన్నారు.

కిటకిటలాడుతూ..

కిటకిటలాడుతూ..

అభిమానులు తరలిరావటంతో ప్రాంగణం కిటకిటలాడింది. నాలుగు పాటలను తెరపై ప్రదర్శిస్తూ నృత్యాలు, పాటలతో అలరింపజేశారు.

హైలెట్ గా...

హైలెట్ గా...

పంక్షన్ లో...హీరోయిన్ ఎస్తేర్ అందచందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆమెను పలకరించటానికి అంతా ఎగబడ్డారు.

అంతా సందడే..

అంతా సందడే..


తమ పట్టణంలో పెరిగి పెద్దైన హీరో సునీల్ రావటంతో అంతా ఆనందం వెల్లి వెరిసింది. సునీల్ కి ఘన స్వాగతం చెప్పారు.

ఎవరెవరు...

ఎవరెవరు...

ఈ కార్యక్రమంలో మాగంటి బాబు, అంబికా కృష్ణ, చంద్రబోస్‌, అనంతశ్రీరామ్‌, అశోక్‌కుమార్‌, ఫృధ్వీ తదితరులు పాల్గొన్నారు.

ఒకరి మృతి ..

ఒకరి మృతి ..


ఈ వేడుకలో అపశ్రుతి దొర్లింది. పట్టణానికి చెందిన సంగినీడి సురేష్‌ (25) మృతి చెందాడు. ఇతనికి భార్య, కుమార్తె ఉన్నారు. ఆడియో వేడుకను తిలకించేందుకు వెళ్లిన అతను తొక్కిసలాటలో గాయపడి మృతి చెందినట్లు మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. ''ఫిట్స్‌తో పడిపోయి మృతి చెందాడని భావిస్తున్నాం. ఇంతవరకు మాకు ఏ ఫిర్యాదూ అందలేదు''అన్నారు పోలీసులు.

తెర వెనక...తెర ముందు..

తెర వెనక...తెర ముందు..

తనికెళ్ల భరణి, జయప్రకాశ్‌రెడ్డి, షాయాజి షిండే, రఘుబాబు, పోసాని కృష్ణమురళి, 'అదుర్స్' రఘు, 'సత్యం' రాజేశ్, శ్రీనివాసరెడ్డి, గౌతంరాజు,తాగుబోతు రమేశ్, సామ్రాట్, తెలంగాణ శకుంతల, సన, శివపార్వతి, బెంగుళూరు పద్మ, విష్ణుప్రియ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: కవి కాళిదాస్, మాటలు: శ్రీధర్ సీపన, సంగీతం: అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం: సంతోష్ రాయ్, నిర్మాత: సురేశ్‌బాబు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఉదయశంకర్.

English summary
Sunil's Bheemavaram Bullodu audio launched on Sunday [Dec 22] at D.N.R Engineering College, Bheemavaram. Uday Shankar directed Bheemavaram Bullodu casts Esther as Sunil's love interest, while Anoop Rubens has composed the music. Followed by the audio launch of Bheemavaram Bullodu releasing on 22nd December, producer D. Suresh Babu of Suresh Productions is planning to release the film for coming Pongal on January 14th or 15th probably.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu