»   » ‘భీమవరం బుల్లోడు’ ఒడ్డున పడేందుకు ఇలా... (ఫోటోలు)

‘భీమవరం బుల్లోడు’ ఒడ్డున పడేందుకు ఇలా... (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సునీల్, ఏస్తర్ హీరో హీరోయిన్లుగా నటించిన 'భీమవరం' బుల్లోడు చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. కామెడీ ఎంటర్టెనర్‌గా తెరకెక్కిన ఈచిత్రం విడుదలైన రోజే మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. దీంతో సినిమాను నిలబెట్టేందుకు యూనిట్ సభ్యులు తమ శక్తిమేర ప్రయత్నిస్తున్నారు.

వివిధ జిల్లాల్లో యూనిట్ సభ్యులు సక్సెస్ టూర్స్ ద్వారా సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో యూనిట్ సభ్యుల పర్యటన ముగిసింది. రాజమండ్రి, కాకినాడ, తిరుపతి, గుంటూరు మీదుగా 'భీమవరం బుల్లోడు' యూనిట్ సభ్యులు హైదరాబాద్ చేరుకోనున్నారు.

విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సునీల్, ఏస్తర్ మాట్లాడారు. అందుకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో......

సునీల్ మాట్లాడుతూ...

సునీల్ మాట్లాడుతూ...

హీరో సునీల్ మాట్లాడుతూ భీమవరం బుల్లోడు చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షక దేవుళ్లకు రుణపడి ఉంటానని తెలిపారు. సినీ రంగాన్ని ప్రేక్షక దేవుళ్లు ఎంతగానో ఆదరించి కళామతల్లి నీడలో ఉన్న ఎన్నో కుటుంబాలను కాపాడుతున్నారని తెలిపారు.

ఏస్తర్ మాట్లాడుతూ...

ఏస్తర్ మాట్లాడుతూ...


భీమవరం బుల్లోడు చిత్రం ఊహించిన దానికంటే ఎక్కువగానే విజయం సాధించిందని తెలిపారు. సినిమా చూసిన ప్రేక్షకులంతా ఎంతో చక్కగా నవ్వుకుంటున్నారని తెలిపారు.

సక్సెస్ టూర్లో...

సక్సెస్ టూర్లో...


భీమవరం బుల్లోడు సక్సెస్ టూర్లో దర్శకుడు ఉదయ్ శంకర్, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, నటుడు సత్యం రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

నెక్ట్స్ సినిమాల గురించి...

నెక్ట్స్ సినిమాల గురించి...


హిందీలో నటుడు గోవింద మాదిరి తెలుగులో ఎదగాలనేదే తన లక్ష్యమని చెప్పిన సునీల్...ప్రస్తుతం ‘భక్త కన్నప్ప' చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా నల్లమలుపు బుజ్జి, మోహన్ బాబు నిర్మిస్తున్న మరో రెండు చిత్రాల్లో నటిస్తున్నట్లు సనీల్ తెలిపారు.

English summary
Bhimavaram Bullodu directed by Uday Shankar. Produced by Daggubati Suresh Babu on his home banner Suresh Productions, the film features Sunil and Ester Noronha in the lead roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu