»   » ఉపాసన పోస్ట్ చేసిన ఫొటో చూసారా? : చరణ్ కొత్త నేస్తం

ఉపాసన పోస్ట్ చేసిన ఫొటో చూసారా? : చరణ్ కొత్త నేస్తం

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ చరణ్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ ఇప్పుడు విరామం తీస్కున్న సంగతి తెలిసిందే, ఎండ ప్రభావం తగ్గేదాకా షూటింగ్ ఆపాలనుకున్నారట. ఈ గ్యాప్ లో అభిమానులిచ్చిన ఓ గిఫ్ట్ తోనే ఎక్కువ గా గడుపుతున్నాడు చరణ్.

భీమవరం దగ్గర

భీమవరం దగ్గర

ఈ సినిమా షూటింగ్ అప్పుడే పాపికొండల మధ్య ఉండే గిరిజనగూడెం పేరంటాలపల్లిని సందర్శించారు., కొల్లేరు ప్రాంతం లో జరిగినప్పుడు అక్కడి ప్రజలతోనూ ఆప్యాయంగా మాట్లాడారు, తర్వాత భీమవరం దగ్గర కూడా మెగా అభిమానులకు అదే స్థాయిలో మెగా ఫ్యామిలీ అభిమానులకు ఎంత విలువ ఇస్తుందో చూపించారు...

స్పెషల్ గిఫ్ట్

స్పెషల్ గిఫ్ట్

మరి ఆ ఆ ప్రాంత ప్రజలు కూడా తమ అభిమానాన్ని చాటుకుంటూనే ఉన్నారు. వెళ్ళిన ప్రతీ చోటా తమకు తగ్గట్టు గా చెర్రీ మీద ప్రేమతో గిఫ్ట్ లు ఇస్తూనే ఉన్నారు. ఆ గిఫ్టుల్లో ఒక స్పెషల్ గిఫ్ట్ ఉంది. అదేమిటంటే భీమ వరం కోడిపుంజు. కోడి పందాలకూ, పందెం కోళ్ళకూ ప్రసిద్ది అన్న విషయం తెలుసు కదా.

 పందెం కోడి

పందెం కోడి

అందుకే తమ ప్రాంతా నికి అనధికారిక చిహ్నం లాంటి పందెం కోడిని చెర్రీ చేతుల్లో పెట్టారు. మనోడు ఊరుకుంటాడా.. అసలే జంతు ప్రేమికుడు మనోడికి తగ్గట్టే భార్య ఉపాసనకి కూడా జంతువులంటే చాలా ఇష్టం. అందుకే ఆ కోడిని హైదరాబాద్ తీసుకొచ్చి తమ ఫామ్ హౌస్ లో పెట్టుకున్నారు.

మీరూ చూడండి

ఇప్పటికే అక్కడ గుర్రాలూ, కుక్కలూ, కోళ్ళూ, కుందేళ్ళూ అంటూ చిన్న సైజు జూ లా తయారయిన ఫామ్ హౌస్ లో ఈ కోడి కూడా దర్జాగా అడుగు పెట్టింది. అయితే అభిమానులు ఇచ్చిన గిఫ్ట్ కదా అందుకే కాస్త ఎక్కువ చనువు తీసుకొని చరణ్ భుజాల మీదెక్కి మరీ ఫోజు కొడుతోంది. అలా ఉన్నప్పుడే ఫొటో తీసిన ఉపాసన తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. చరణ్ ఫొటో ఇప్పుడు ఫేస్ బుక్ లో పిచ్చ పాపులర్ అయిపోయింది. ఆ కోడి రాజసం మీరూ చూడండి ఓ సారి.

English summary
A fan gifted a very famous "bheemavaram Pandem kodi" (Crow) to Mega hero Ram Charan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu