»   » అదిరిపోయేలా స్టెప్పులేస్తున్న సునీల్ (ఫోటోలు)

అదిరిపోయేలా స్టెప్పులేస్తున్న సునీల్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కమెడియన్ నుంచి హీరోగా టర్న్ అయిన సునీల్ కథానాయకుడిగా నటిస్తున్నచిత్రం 'భీమవరం బుల్లోడు'. సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థపై ప్రముఖ నిర్మాత సురేష్ బాబు నిర్మిస్తున్న ఈచిత్రాన్ని 'కలిసుందాం..రా!, ప్రేమతో..రా!, రారాజు, బలాదూర్' వంటి సినిమాలను తెరకెక్కించిన ఉదయ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. 'వేయి అబద్దాలు' ఫేమ్ ఎస్తేర్ హీరోయిన్ గా నటిస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ దాదాపుగా చిత్రీకరణను పూర్తిచేసుకుంది. అతి త్వరలోనే ఆడియోని విడుదల చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్టెనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

తాజాగా విడుదలైన ఈ చిత్రం పోస్టర్లు సునీల్ పెర్ఫార్మెన్స్‌పై ఆసక్తిని పెంచుతున్నాయి. సినిమాలో సునీల్ అదిరిపోయేలా స్టెప్పులేసాడని ఈ ఫోటో చూస్తే స్పష్టమవుతోంది.

భీమవరం బుల్లోడు

భీమవరం బుల్లోడు


'పూలరంగడు' వంటి హిట్ చిత్రం తరువాత సునీల్ - అనూప్ రూబెన్స్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాగానూ.. 'తడాఖా' వంటి హిట్ చిత్రం తరువాత సునీల్ హీరోగా నటిస్తున్న చిత్రంగానూ 'భీమవరం బుల్లోడు' వార్తల్లో నిలుస్తోంది.

సురేశ్ బాబు

సురేశ్ బాబు


చిత్రనిర్మాత సురేశ్‌బాబు మాట్లాడుతూ 'మా సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థకు ఇది 50వ సంవత్సరం. ఈ నేపథ్యంలో వస్తున్న 'భీమవరం బుల్లోడు' చిత్రం మా బేనర్‌కు ఎంతో ప్రతిష్టాత్మకం కానుంది. భీమవరం వాసి అయిన సునీల్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తుండటంతో చిత్రానికి ఆయన ఊరి పేరే పెట్టాం. అనూప్ రూబెన్స్ స్వరపరిచిన పాటలను త్వరలో విడుదల చేస్తాం' అని తెలిపారు.

సంక్రాంతి రిలీజ్

సంక్రాంతి రిలీజ్


సినిమాని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశాలున్నాయని వినిపిస్తోంది. అదే గనుక జరిగితే. సంక్రాంతికి సునీల్ హీరోగా వచ్చే తొలి సినిమాగా 'భీమవరం బుల్లోడు'కి ప్రత్యేక స్థానం దక్కుతుంది.

ఉదయ్ శంకర్

ఉదయ్ శంకర్


దర్శకుడు ఉదయశంకర్ మాట్లాడుతూ 'కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ 'కలిసుందాం..రా', 'బలాదూర' తరువాత సురేశ్ సంస్థలో నేను పనిచేస్తున్న మూడో సినిమా ఇది. ఇందులో సునీల్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది. సురేష్‌ ప్రొడక్షన్స్‌ 50ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెరకెక్కిస్తున్న చిత్రంలో పని చేయడం ఆనందంగా ఉంది' అని చెప్పారు.

నటీనటులు

నటీనటులు


తనికెళ్ల భరణి, జయప్రకాశ్‌రెడ్డి, షాయాజి షిండే, రఘుబాబు, పోసాని కృష్ణమురళి, 'అదుర్స్' రఘు, 'సత్యం' రాజేశ్, శ్రీనివాసరెడ్డి, గౌతంరాజు,తాగుబోతు రమేశ్, సామ్రాట్, తెలంగాణ శకుంతల, సన, శివపార్వతి, బెంగుళూరు పద్మ, విష్ణుప్రియ తదితరులు నటిస్తున్నారు.

టెక్నీషియన్స్

టెక్నీషియన్స్


ఈ చిత్రానికి కథ: కవి కాళిదాస్, మాటలు: శ్రీధర్ సీపన, సంగీతం: అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం: సంతోష్ రాయ్, నిర్మాత: సురేశ్‌బాబు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఉదయశంకర్.

భీమవరంలో ఆడియో?

భీమవరంలో ఆడియో?


టైటిల్‌కు తగ్గట్టు సునీల్ సొంతూరు అయిన భీమవరంలో ఈ సినిమా ఆడియో వేడుక జరపాలని యూనిట్ ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

ముఖ్య అతిథి త్రివిక్రమ్

ముఖ్య అతిథి త్రివిక్రమ్


సునీల్‌కు ఆప్తమిత్రుడైన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా ఈ వేడుక జరుగనుందని కూడా వినిపిస్తోంది.

డిజిటల్ పోస్టర్

డిజిటల్ పోస్టర్


చిత్రానికి సంబంధించిన డిజిటల్ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేశారు.

సునీల్, ఎస్తేర్

సునీల్, ఎస్తేర్


సునీల్, ఎస్తేర్ జంటగా సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ‘భీమవరం బుల్లోడు'. డి.సురేష్‌బాబు నిర్మాణంలో ఉదయ్‌శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

English summary
New stills of Sunil starrer Bheemavarapu Bullodu are out. The film is being produced on the prestigious Suresh Productions banner. As the production house has completed 50 years , the first look stills were released.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu