»   » కాఫీ కప్పులో ప్రముఖ దర్శకుడు భీమినేని శ్రీనివాస రావు

కాఫీ కప్పులో ప్రముఖ దర్శకుడు భీమినేని శ్రీనివాస రావు

Posted By:
Subscribe to Filmibeat Telugu

గతంలో శుభాకాంక్షలు, సుస్వాగతం,సూర్య వంశం వంటి సూపర్ హిట్స్ అందించిన దర్సకుడు భీమినేని శ్రీనివాస రావు త్వరలో నటుడుగా పలకరించనున్నారు. వరుణ్ సందేశ్ తాజా చిత్రం కుదిరితే కాఫీ కప్పు చిత్రంలో ఆయన వరుణ్ సందేశ్ తండ్రిగా చేస్తున్నారు. సుస్వాగతం చిత్రంలో రఘువరన్ తరహా క్యారెక్టరైజేషన్ తో ఈయన పాత్ర సాగనుందని తెలుస్తోంది. కొడుకుని స్నేహితుడిలా భావిస్తూ ఎంకరేజ్ చేసే ఈ పాత్రతో భీమినేని నటుడుగా కూడా బిజీ అవుతాడని యూనిట్ వారు అంటున్నారు. ఇక ఈ చిత్రం ద్వారా రమణ సెల్వా అనే కెమెరా మెన్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. భీమినేని శ్రీనివాసరావు ప్రస్తుతం అల్లరి నరేష్ హీరోగా ఓ చిత్రం ప్లాన్ చేస్తున్నట్లు సమచారం.

ఇక వరుణ్ సందేశ్, సుమాభట్టాచార్య జంటగా రూపొందిన 'కుదిరితే కప్పు కాఫీ" అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 25న విడుదల కానుంది. 80 స్క్రీన్స్‌తో ఆంధ్రప్రదేశ్ అంతటా విడుదల చేయనున్నారు. తెలుగు ప్రేక్షకులకు పూర్తి సంతృప్తినిచ్చే చిత్రమిదని దర్శకుడు చెప్తున్నారు.సుకుమారి, తనికెళ్ల భరణి, శివన్నారాయణ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం యోగేశ్వరశర్మ, పాటలు: సిరివెన్నె సీతారామశాస్ర్తీ, మాటలు: అబ్బూరి రవి, ఎడిటింగ్: అనిల్‌కుమార్, కెమెరా: సంతోష్‌రాయ్, ఆర్ట్: శశిధర్ అడప, నిర్మాతలు: శివ, మహి, కథ స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రమణ సాల్వ.

English summary
Director Bhimineni Srinivasa Rao is playing father. The director has donned the grease paint for the film Kudirithe Kappu Coffee. Bhimineni is playing the role of Varun Sandesh’s father in the film. The film is directed by Ramana Salva a former associate of Bhimineni. The director forced Bhimineni to play the role in the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu