భీమినేని దర్శకత్వంలో రవితేజ!
అందుకే కథ, స్క్రిప్టు విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రవితేజ తర్వాతి సినిమా భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటికే వీరిద్దరి కథ, స్క్రిప్టు విషయంలో ఓ అవగాహన కుదిరిందని తెలుస్తోంది.
రీమేక్ మూవీల దర్శకుడిగా పేరుతన్న భీమినేని శ్రీనివాసరావు గతంలో అల్లరి నరేష్ హీరోగా 'సుడిగాడు' చిత్రం తెరకెక్కించారు. ఓ తమిళ చిత్రం రీమేక్‌గా తెరకెక్కించిన 'సుడిగాడు' చిత్రం హిట్ టాక్ తెచ్చుకోవడంతో పాటు, తెలుగు బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలను రాబట్టింది.
తాజాగా రవితేజ-భీమినేని కాంబినేషన్లో రాబోయే సినిమా కూడా తమిళ రీమేక్ సినిమానే అని, తమిళంలో హిట్టయిన 'సుందర పాండ్యన్' చిత్రాన్ని తెలుగులో వీరిద్దరి కాంబినేషన్లో రీమేక్ చేస్తున్నారని తెలుస్తోంది. త్వరలో ఈ ప్రాజెక్టు విషయమై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.


Click it and Unblock the Notifications












