»   »  సొంత కొడుకునే కిడ్నాప్ చేయబోయి పట్టుబడ్డ నటుడు

సొంత కొడుకునే కిడ్నాప్ చేయబోయి పట్టుబడ్డ నటుడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

'ఫ్రమ్ అలహాబాద్ టు ఇస్లామాబాద్' ఈ సినిమా మనకు పరిచయం లేదు గానీ కొన్నాళ్ళకిందట ఉత్త్ర భారత దేశం లో భోజ్ పురీ భాషలో వచ్చి పెద్ద హిట్ నే అందుకుంది. అందులో నటించిన వాళ్ళందరికీ మంచి పేరే వచ్చింది. ఆ సినిమా తోనే కొంత పాపులారిటీ తెచ్చుకున్నాడు నటుడు మహమ్మద్ షాహీద్. అంతకు ముందే నటుడు అయినా ఈ సినిమా మరింత పేరు తీసుకొచ్చింది. అయితే ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వార్తల్లోకి ఎక్కాడు మహమ్మద్ షాహీద్... అయితే గొప్ప పని చేసి కాదు కిడ్నాప్ కేసులో పట్టుబడి అదీ ఎవరినో కాదు తన సొంత కొడుకునే కిడ్నాప్ చేయబోయి పోలీసులకు పట్టు బడ్డాడు షాహీద్....

ఈ సినీనటుడు తన ప్రేయసితో కలిసి కన్న కొడుకునే కిడ్నాప్ చేసిన ఘటన ఢిల్లీలో సంచలనం రేపింది. ఢిల్లీలోని లక్ష్మీనగర్ కు చెందిన భోజ్‌పురి సినిమా నటుడు ముహమ్మద్ షాహిద్ ముస్కాన్ లు భార్యాభర్తలు. వీరికి షెహనాజ్ అనే రెండేళ్ల ఓ కుమారుడున్నాడు. కుటుంబ వివాదంతో భార్యాభర్తలు విడిపోయారు. ఆ తర్వాత ముస్కాన్ మరో వ్యక్తిని పెళ్లాడింది. దీంతో నటుడైన షాహిద్ కూడా తన ప్రేయసి అయిన సునయన శర్మ అలియాస్ అలీషాతో కలిసి సహజీవనం చేస్తున్నాడు.

Bhojpuri actor arrested for kidnapping own son

అయితే భార్యతో విడిపోయే సమయం లో కోర్టు ఆదేశాల ప్రకారం కుమారుడు షెహనాజ్ తల్లి సంరక్షణలో ఉన్నాడు. అందుకే షాహీద్ తన కుమారున్నీ చూసేందుకు గానీ, కలవటానికి గానీ వీల్లేదంటూ కట్టడి చేయాలన్న్ ఉద్దేశం తో ముస్కాన్ తన మాజీ భర్త అనుమతించలేదు.ఎలాగైనా తన మాజీ భార్యకు గుణపాఠం నేర్పించాలనే ఉద్దేశంతో షాహిద్ తన ప్రేయసి అలీషాతో కలిసి కుమారుడినే కిడ్నాప్ చేశాడు.

అనంతరం కుమారుడి పట్ల మాజీ భార్య నిర్లక్షం వహించినందువల్లే బాలుడు కిడ్నాప్ కు గురయ్యాడని షాహిద్ ఆరోపించాడు. బాలుడి కిడ్నాప్ ఘటనపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు జరిపిన దర్యాప్తులో బాలుడు షెహనాజ్ ను షాహిద్ తన ప్రేయసితో కలిసి కిడ్నాప్ చేసి తన వద్దే ఉంచుకున్నాడని తేలింది. దీంతో కిడ్నాపర్లు అయిన షాహిద్, అలీషాలను అరెస్టు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.కిడ్నాపరు అయిన షాహిద్.

English summary
According to the police, Mohammed Shahid kidnapped his son in connivance with his live-in partner, and misled the police during the investigation.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu