»   » దయనీయ స్థితిలో హీరోయిన్: సల్మాన్ కనికరించలేదు, కానీ.... మన తెలుగు విలన్ హెల్ప్ చేశాడు!

దయనీయ స్థితిలో హీరోయిన్: సల్మాన్ కనికరించలేదు, కానీ.... మన తెలుగు విలన్ హెల్ప్ చేశాడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సల్మాన్ ఖాన్ హీరోగా 90ల్లో వచ్చిన 'వీర్‌గాటి‌' చిత్రంలో నటించిన పూజా దద్వాల్ అనే హీరోయిన్ ప్రస్తుతం అత్యంత దీనమైన స్థితిలో ఉన్నట్లు వార్తలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆర్థికంగా చితికి పోయి టీబీ వ్యాధి భారిన పడి వైద్యం చేయించుకోవడానికి, కనీసం టీ తాగడానికి కూడా డబ్బుల్లేని స్థితిలో ఉన్న ఆమె.... సల్మాన్ ఖాన్ తనకు సహాయం చేయాలని మీడియా ద్వారా వేడుకుంది. ఆమె పరిస్థితి చూసి సల్మాన్ ఖాన్ మనసు కరిగలేదు కానీ... మన తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భోజ్‌పురి స్టార్ రవి కిషన్ మనసు కరిగింది.

చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

సల్మాన్ ఖాన్ ఆ హీరోయిన్ ని పట్టించుకోవట్లేదా ?
సహాయం చేసిన రవి కిషన్

సహాయం చేసిన రవి కిషన్

పూజా దద్వాల్ దయనీయ స్థితి గురించి తెలుసుకున్న రవి కిషన్ తన మనుషులను ఆమె చికిత్స పొందుతున్న ముంబై ఆసుపత్రికి పంపి ఫ్రూట్స్, కొంత డబ్బు అందజేశారు.

గతంలో పూజాతో పని చేసిన రవి కిషన్

గతంలో పూజాతో పని చేసిన రవి కిషన్

గతంలో రవి కిషన్ ఓ సినిమాలో పూజా దద్వాల్‌తో కలిసి పని చేశాడు. 1997లో వచ్చి ‘తుమ్ సే ప్యార్ హో గయా' కలిసి ఆమెతో కలిసి వర్క్ చేశాడు. పూజా పరిస్థితి ఇలా అయిందనే విషయం తెలుసుకున్న రవి కిషన్... తన వంతు సహాయం అందించారు.

 థాంక్స్ చేసిన పూజా, వీడియో వైరల్

థాంక్స్ చేసిన పూజా, వీడియో వైరల్

రవి కిషన్ తన ప్రతినిధులను పంపి సహాయం చేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రవి కిషన్ అందించిన సహాయంపై సంతోషం వ్యక్తం చేస్తూ అతడికి కృతజ్ఞతలు తెలియజేసింది పూజా.

 సల్మాన్‌ను సహాయం కోరుతూ

సల్మాన్‌ను సహాయం కోరుతూ

ఇంతకు ముందు పూజా దద్వాల్ సల్మాన్ ఖాన్‌ను సహాయం కోరుతూ ఓ మీడియా ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. తన వద్ద వైద్యానికి కూడా డబ్బులు లేవని, టీ తాగడానికి కూడా ఇతరులపై ఆధార పడాల్సి వస్తుందనే ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ‘రేస్ 3' మూవీ షూటింగలో ఉన్న సల్మాన్ ఖాన్‌కు పూజా దయనీయ స్థితి గురించి తెలిసిందో? లేదో?

 ఆరు నెలల నుండి టీబీతో

ఆరు నెలల నుండి టీబీతో

తాను గత ఆరు నెలల నుండి టీబీ కారణంగా తీవ్రమైన అనారోగ్యంతో బాధ పడుతున్నానని, గత 15 రోజులకి క్రితం ముంబైలోని ఆసుపత్రిలో చేరానని, తనకు సహాయం అందించాలని పూజా దద్వాల్ వేడుకుంటోంది. సినిమాల్లో అవకాశాలు తగ్గిన తర్వాత గోవాలో కొంతకాలం క్యాసినో మేనేజ్మెంట్ రన్ చేశానని, ప్రస్తుతం తన వద్ద వైద్యానికి కూడా డబ్బులు లేవని పూజా చెబుతోంది.

English summary
Salman Khan's Veergati co-actress Pooja Dadwal is currently suffering from Tuberculosis and doesn't have money for her treatment. While she had recently sought the superstar's help to finance her treatment, it is Bhojpuri actor Ravi Kishan who actually came up to her aid.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X