»   » వేషం కోసం వస్తే.. దర్శకుడు రేప్ చేసాడు

వేషం కోసం వస్తే.. దర్శకుడు రేప్ చేసాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా...ఎంతగా చట్టాలు కఠినంగా అమలుపరుస్తున్నా వేషం కోసం తిరిగే నటీమణులపై అత్యాచారాలు జరగటం మాత్రం తగ్గటం లేదు. తాజాగా అటువంటి సంఘటన ముంబైలో జరిగి మళ్లీ వార్తల్లో నిలిచింది.

వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్ కు చెందిన ఓ నటి (30) ని రేప్ చేసి, మోసం చేసిన కేసులో భోజ్ పురి దర్శకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దర్శకుడికి సహకరించారనే ఫిర్యాదుపై అతని దగ్గర పనిచేసే ఇద్దరు సహాయ దర్శకులను కూడా అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ బావ్చే చెప్పారు.

Bhojpuri director held for raping Pakistani actor in Mumbai

గత మూడేళ్లుగా దర్శకుడికి అత్యాచారానికి గురైన ఈ పాక్ నటితో పరిచయమున్నట్టు పోలీస్ అధికారి చెప్పారు. సినిమాల్లో అవకాశాలు ఇస్తానని చెప్పి పలుమార్లు ఆమెపై లైంగికదాడి చేసినట్టు తెలిపారు.

అంతేకాదు...సినిమా నిర్మించేందుకుగాను ఆమె నుంచి 35.80 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడని, ఈ సొమ్మును తిరిగి చెల్లించలేదని ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు. కాగా నిందితుల పేర్లను బయటపెట్టడానికి పోలీసులు ఇష్టపడలేదు.

English summary
A Bhojpuri film director has been arrested by the Mira Road police for allegedly cheating and raping a small time female actor from Pakistan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu