Don't Miss!
- Finance
Hindenburg: హిండెన్‌బర్గ్ స్థాపించింది ఎవరు..? అసలు ఈ కంపెనీ ఏం చేస్తుందంటే..
- Lifestyle
4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ అంటే ఏంటి? ఇది ఆందోళనను తగ్గిస్తుందా?
- News
తారకరత్నను చూడగానే ఒక్క సారిగా జూ ఎన్టీఆర్ ..: తారక్ కోసం మంత్రిని పంపిన సీఎం..!!
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Sports
ఒక్క మ్యాచ్ చూసి డెసిషన్ తీసుకోకూడదు.. ఇషాన్, ధవన్‌పై వెటరన్ కామెంట్స్!
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
ఆయన పనితనం నచ్చే కమిటయ్యా...భూమిక
ఆయనలోని పనితనాన్ని గమనించాను. తను అనుకున్నది తెరపై వచ్చేంత వరకు రాజీపడడు..అందుకే మరోసారి రవిబాబు చిత్రం 'అమరావతి' చేసాను అంటోంది భూమిక. 'అమరావతి' చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడింది...'అమరావతి'లో నటించడానికి ప్రేరేపించిన కారణాలు చెప్తూ...కథ, అందులోని నా పాత్ర. అన్నింటికన్నా మించి దర్శకుడు రవిబాబు. నాకు తెలిసి ఆయన చాలా మంచి దర్శకుడు. సినిమా రంగానికి సంబంధించిన అన్ని శాఖలపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. ప్రతీది ప్రణాళిక ప్రకారం చేస్తాడాయన. 'అనసూయ' సమయంలోనే ఆయనలోని పనితనాన్ని గమనించాను. తను అనుకున్నది తెరపై వచ్చేంత వరకు రాజీపడడు అంటోంది. అలాగే వరసగా థ్రిల్లర్ చిత్రాలకే ఫిక్స్ కాలేదని చెప్తూ..నేను ఈ తరహా చిత్రాల్లోనే నటించాలని నేనెప్పుడూ ఫిక్సవ్వను. నాకు లభించిన అవకాశాలను సద్వినియోగ పరుచుకొని నటీమణిగా నన్ను నేను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుంటాను.
ఇక అమరావతి చిత్రం సక్సెస్ ఇచ్చిందా అన్నదానికి..ప్రతి సినిమా 'అనసూయ'లా వుండాలనుకుంటే ఎలా..అనసూయ అనసూయే.. అమరావతి..అమరావతే..దేని ప్రత్యేకత దానిది. నాకు రెండు చిత్రాలు సంతృప్తినే ఇచ్చాయి.అయినా ఇప్పటి వరకు నా కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశాను. ఒక దానితో మరొకదానికి పోలిక వుండ కుండా జాగ్రత్తపడ్డాను. ఒకే ఇమేజ్ చట్రంలో వుండటం నాకస్సలు ఇష్టం వుండదు. అందుకే వైవిధ్యానికే పెద్ద పీట వేస్తాను. 'అనసూయ' తర్వాత 'మల్లెపువ్వు' చిత్రంలో ఓ డిఫరెంట్ పాత్రను చేశాను. కమర్షియల్‌గా ఆ చిత్ర విజయాన్ని పక్కన పెడితే ఆ చిత్రం కూడా నటిగా నా దాహాన్ని తీర్చింది. ప్రస్తుతం ఆమె యాగం, కొత్తబంధం చిత్రాల్లో చేస్తోంది. తమిళంలో కూడా ఓ చిత్రంలో నటిస్తున్నాను అని చెప్తూ...త్వరలో ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేయని ఓ చాలెంజింగ్ రోల్‌తో మీ ముందుకు రాబోతున్నాను అంటోంది.