»   »  డైరక్టర్ కాబోతున్న హీరోయిన్

డైరక్టర్ కాబోతున్న హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Bhoomika
పెళ్ళయితే చాలా మంది హీరోయిన్స్ నటననుంచి తప్పుకుని సంసార బాధ్యతల్లో కూరుకుపోతారు. అయితే భూమిక మాత్రం ఆపోజిట్ గా బిహేవ్ చేస్తోంది. పెళ్ళయిన తర్వాత మల్లెపూవు,అనసూయలో చేసి హీరోయిన్ గా కంటిన్యూ అవుతోంది. అలాగే డౌన్ టౌన్ ఎంటర్ టైన్ మెంట్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్ధ పెట్టి తనకు సత్యభామ వంటి మెగా ఫ్లాఫ్ ఇచ్చిన దర్శకుడు శ్రీహరి నానుకి మళ్ళీ అవకాశ మిచ్చి లైఫ్ ఇస్తోంది.

అలాగే ఆ సినిమా అనంతరం ఆమె దర్శకత్వం కూడా చేయటానికి సన్నాహాలు చేయబోతోంది. అయితే ఆ కథ మరెవరిదో కాదుట. వర్షం దర్శకుడు శోభన్ ఆమెకు నేరేట్ చేసిన కథట. అలాగే ఆ సినిమాను ఆమే నిర్మించుకుంటుందిట. అసలు అప్పుడు శోభన్ ఆమె నిర్మాతగా సినిమా చేసే ప్రాసెస్ లోనే కథ చెప్పాడని వినికిడి.అయితే ఆ సినిమా ఓ థ్రిల్లర్ అని తెలుస్తోంది. అనసూయ చేసిన అనుభవంతో ఆ సినిమా లాగిస్తుందన్నమాట. అంటే మనకు మరో మహిళా దర్శకురాలు లభిస్తోంది త్వరలో . ఇదే నిజమైతే చనిపోయిన శోభన్ కోరిక నెరవేరుస్తున్నట్లేగా...బెస్ట్ ఆఫ్ లక్ భూమిక...

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X