»   »  రాజశేఖర్ సరసన భూమిక?

రాజశేఖర్ సరసన భూమిక?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Bhoomika
ఇన్నాళ్ళూ నా ప్రక్కన హీరోయిన్స్ నటించటానికి ముందుకు రావటం లేదని ఆరోపిస్తున్న రాజశేఖర్ ఇప్పుడిక మాట్లాడే అవకాశం లేదు. ఆయన ప్రక్కన పేరున్న హీరోయిన్ భూమిక నటించటానికి రెడీ అయింది. చిరునవ్వుతో ఫేమ్ రామ్ ప్రసాద్ దర్శకత్వంలో రానున్న సినిమాలో ఈ జంట చేయనున్నారు. ఇక ఈ సినిమా హలో అనే మళయాళ సినిమా రీమేక్. కామిక్ థ్రిల్లర్ గా నడిచే ఈ సినిమా లో రాజశేఖర్ ఓ త్రాగుబోతు లాయర్ గా కనిపిస్తారు. ఇక ఆయన సాయం కోరే అమ్మాయిగా భూమిక కనిపిస్తుంది. భూమిక ప్రస్తుతం సముద్ర దర్శకత్వంలో మల్లెపూవు సినిమాలో ప్రధాన పాత్ర చేస్తోంది. రాజశేఖర్ తన భార్య జీవిత దర్శకత్వంలో సత్యమేవ జయితే చిత్రంలో చేస్తున్నారు. అమితాబ్ ఖాఖి చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X