»   » భూమిక, నవదీప్ ల 'యాగం' రేపు

భూమిక, నవదీప్ ల 'యాగం' రేపు

Posted By:
Subscribe to Filmibeat Telugu

భూమిక, నవదీప్, కిమ్ శర్మ కాంబినేషన్ లో రూపొందిన 'యాగం' చిత్రం రేపు (20న) విడుదల కానుందని యూనిట్ వర్గాలు మీడియాకు తెలియచేసారు. మొదట ఈ చిత్రాన్ని ఈ రోజు(శుక్రవారం) రిలీజ్ ప్లాన్ చేసారు. కానీ టాలీవుడ్ బంద్ ప్రకటించటంతో నిర్ణయం మార్చుకుని ఒక రోజు వాయిదా వేసారు. అయితే టాలీవుడ్ కి ప్రభుత్వం పైరసీ విషయంలో హామీ ఇవ్వటంతో బంద్ విరమించింది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ మాత్రం అలాగే ఉంచారు. ఇక ఈ చిత్రం గురించి హీరో నవదీప్ మాట్లాడుతూ...'గౌతమ్ ఎస్.ఎస్.సి.' వంటి విలక్షణ చిత్రాన్ని తీసిన అరుణ్ ప్రసాద్ ఈ చిత్రాన్ని కూడా వినూత్నంగా తెరకెక్కించారనీ, 90 శాతం షూటింగ్ బ్యాంకాక్ లో జరిపామనీ చెప్పారు. ఇందులో తాను బార్ టెండర్ గా నటించగా, భూమిక ఎయిర్ హోస్టెస్ గా, బార్ లో తన కొలీగ్ గా కిమ్ శర్మ నటించినట్టు తెలిపారు. తొలుత ఈనెల 19న సినిమా విడుదల చేయాలని అనుకున్నప్పటికీ పరిశ్రమ బంద్ కారణంగా 20న రిలీజ్ అవుతుందని చెప్పారు. దర్శకుడు కథ గురించి చెబుతూ..డానీ (నవదీప్‌), సోఫీ (కిమ్‌శర్మ) బ్యాంకాక్‌లోని ఓ హోటల్‌లో పని చేస్తుంటారు. నందిని (భూమిక) ఎయిర్‌హోస్టెస్‌. ఈ ముగ్గురి మధ్య జరిగే ఆసక్తికరమైన అంశాలతో కథ నడుస్తుంది. ఇంతకీ ఆ కథేమిటన్నది మాత్రం సస్పెన్స్ అన్నారు. ప్రతి సన్నివేశం ఆకట్టుకుంటుంది. ఎక్కువ భాగం బ్యాంకాక్‌లోనే చిత్రించాం. పాటలకు మంచి స్పందన వస్తోందని దర్శకుడు చెప్పుకొచ్చారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu