twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వర్మ ‘భూత్ రిటర్న్స్’... తెలుగులో ‘బూచి’

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: అప్పట్లో వరుస దెయ్యం సినిమాలపై దృష్టి పెట్టిన రామ్ గోపాల్ వర్మ కొత్త కాలం గ్యాప్ ఇచ్చి మళ్లీ వాటిపై పడ్డారు. గతంలో తాను రూపొందించిన 'భూత్'కు సీక్వెల్‌గా 'భూత్ రిటర్న్స్' అనే చిత్రాన్ని తెరకెక్కించారు. 3డి ఫార్మాట్‌లో దీన్ని రూపొందించారు. అలుంబ్రా ఎంటర్ టైన్మెంట్స్ బేనర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించగా...ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ వారు ఈ చిత్రాన్ని విడుదచేస్తున్నారు. రామ్ గోపాల్ కెరీర్లోనే ఇది ఫస్ట్ 3డి సినిమా.

    ఈ చిత్రాన్ని తెలుగులో 'బూచి' పేరుతో రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఈచిత్రానికి సంబంధించిన అనువాదన కార్యక్రమాలు మొదలు కానున్నాయి. 'భూత్ రిటర్న్' చిత్రం అక్టోబర్ 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే తెలుగు 'బూచి' టైటిల్‌తో రిలీజ్ చేయనున్న ఈచిత్రాన్ని మాత్రం అక్టోబర్ 26న విడుదల చేయనున్నారు. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి కానందునే ఈ చిత్రాన్ని తెలుగులో కాస్త లేటుగా విడుదల చేయబోతున్నారు.

    నిన్నటి తరం కథానాయిక మనీషా కోయిరాలా ఇందులో తల్లి పాత్ర పోషించగా, ఆరేళ్ళ అలయ్న అనే పాప కీలక పాత్ర పోషించింది. ఈ కథ వీరిద్దరి చుట్టూ తిరుగుతుంది కాబట్టి, వీరిద్దరే ఈ సినిమాలో ఎక్కువగా కనిపిస్తారు. జేడీ చక్రవర్తి మరో పాత్రలో కనిపించనున్నాడు.

    'భూత్ రిటర్న్స్ హర్రర్ మూవీ. బూత్ సినిమా మిమ్మల్ని భయపెడితే.., భూత్ రిటర్న్స్ మిమ్మల్ని చంపేస్తుంది' అని అంటున్నాడు వర్మ. వివాదాలతో చేసిన ప్రయోగాలూ కాసులు రాల్చవనే ఉద్దేశానికి వచ్చి తిరిగి తన పాత ఫార్ములానే నెత్తి కెత్తు కుంటున్న వర్మ ఈ సినిమాతో ఎంత వరకు సఫలీకృతం అవుతాడో వేచి చూడాలి.

    English summary
    Ram Gopal Varma's bollywood movie Bhoot Returns as Boochi in Telugu (dubbed version) and is releasing on October 26.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X