»   » అక్క అవుతుందా..?? వదినా..?, నాని సినిమాలో భూమిక

అక్క అవుతుందా..?? వదినా..?, నాని సినిమాలో భూమిక

Posted By:
Subscribe to Filmibeat Telugu

త్వరలో నిన్ను కోరి సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న యంగ్ హీరో నాని.. ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను ప్రారంభించాడు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరాం దర్శకత్వంలో ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) సినిమా చేస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మరో కీలక పాత్రలో ఓ సీనియర్ హీరోయిన్ కనిపించనుంది.

ఆర్థిక సమస్యలు తలెత్తడంతో

ఆర్థిక సమస్యలు తలెత్తడంతో

ఈ మధ్య భూమిక కుటుంబంలో ఆర్థిక సమస్యలు తలెత్తడంతో ఆమె మళ్లీ సినిమాల వైపు చూస్తున్నట్లు వార్తలొచ్చాయి. పోయినేడాది బాలీవుడ్ మూవీ ‘ఎం.ఎస్.ధోని'లో హీరో అక్క పాత్రలో కనిపించింది భూమిక. అందులో తన లుక్ చూడగానే ఇక ఆమె అక్క, వదిన పాత్రలకు ఫిక్సయిపోవాల్సిందే అన్న అభిప్రాయం కలిగింది.

మూడేళ్ల క్రితం

మూడేళ్ల క్రితం

భూమిక ప్రస్తుతం ఒక క్రేజీ మూవీలో అవకాశం దక్కించుకోవడం విశేషం. మూడేళ్ల క్రితం 'ఏప్రిల్ ఫూల్' అనే సినిమాలో మెరిసిన హీరోయిన్ భూమికా చావ్లా ఆ తర్వాత మరే ఇతర తెలుగు సినిమాల్లోనూ నటించలేదు. ఇప్పుడు కొత్త న్యూస్ ఏమిటో తెలుసా భూమిక మళ్ళీ టాలీవుడ్ లో అడుగు పెట్టేసింది .

ఎంసీఏ

ఎంసీఏ

నేచురల్ స్టార్ నాని హీరోగా దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ‘ఎంసీఏ'లో భూమిక ఓ కీలక పాత్ర పోషిస్తోంది. మరి ఆమె నానికి అక్కగా నటిస్తోందా.. వదినగా చేస్తోందా.. ఇంకేదైనా పెద్ద తరహా పాత్ర చేస్తోందా అన్న చర్చలు మొదలయ్యాయి.దీనికి సంబంధించిన అన్ని ఫార్మాలిటీస్ ను పూర్తి చేసేశారు.

ఆమని కూడా

ఆమని కూడా

భూమికతో పాటు సీనియర్ నటి ఆమని కూడా మరో ముఖ్య పాత్రలో కనిపించనుంది. నాని ప్రస్తుతం మాంచి ఫాంలో ఉన్న నేపథ్యంలో అతడి సినిమాలో భూమిక హైలైట్ అయితే.. మున్ముందు మరిన్ని క్యారెక్టర్ రోల్స్ ఆమెకు దక్కే అవకాశాలున్నాయి. ఈ చిత్రంలో నాని సరసన సాయి పల్లవి కథానాయికగా నటించనుంది.

English summary
An interesting news abut the project has surfaced and it is sure going to be a happy news for the fans of 'Kushi' beauty Bhumika Chawla
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu