»   »  సమంత ‘యూ టర్న్’.... భూమిక దెయ్యమా?

సమంత ‘యూ టర్న్’.... భూమిక దెయ్యమా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒకప్పుడు టాలీవుడ్లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ భూమిక కొంతకాలం సినిమాలు మానేసి.... ఇటీవల నాని హీరోగా వచ్చిన 'ఎంసీఏ' చిత్రంలో కీలకమైన పాత్ర ద్వారా రీ ఏంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో భూమిక పోషించిన పాత్రకు విమర్శకుల ప్రశంసలు అందాయి. తాజాగా భూమిక మరో తెలుగు సినిమాలో అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

హీరోయిన్ సమంత 'యూ టర్న్' అనే చిత్రంలో నటించబోతోంది. ఇందులో భూమిక కూడా కనిపించబోతోందట. కన్నడలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో రీమేక్ చేస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్‌కు దర్శకత్వం వహించిన పవన్ కుమార్ ఈ బైల్వింగల్ రీమేక్‌కు కూడా దర్శకత్వం వహించబోతున్నారు.

Bhumika in Samanthas U Turn Moviea

ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్ర కోసం భూమికను సంప్రదించినట్లు సమాచారం. కన్నడ వెర్షన్లో రాధిక చేతన్ పోషించిన పాత్ర కోసు ఆమెను సంప్రదించగా, పాత్ర నచ్చడంతో భూమిక కూడా ఓకే చెప్పినట్లు సమాచారం.

రాధిక చేతన్ కన్నడ వెర్షన్లో దెయ్యం పాత్రలో కనిపించింది. దీంతో తెలుగు వెర్షన్లో భూమిక దెయ్యం పాత్రలో కనిపించబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే సినిమాకు మంచి హైప్ రావడం ఖాయం. దీనిపై అఫీషియల్ సమాచారం వెలువడాల్సి ఉంది.

English summary
Film Nagar source said that, Bhumika in Samantha's U Turn Movie. It seems like Bhumika is going to reprise the role Radhika Chetan has portrayed in Kannada. Interestingly, it is a ghost role and Bhumika will be seen as a ghost in this film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X