»   » భూమికకు మొత్తానికి జ్ఞానోదయం అయ్యింది

భూమికకు మొత్తానికి జ్ఞానోదయం అయ్యింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

నటిగా మంచి పేరు తెచ్చుకున్నానని, అందుకే ప్రస్తుతం నిర్మాతగా రంగ ప్రవేశం చేశానని, నిర్మాతగా కొంత అనుభవం పొందినా వరుసగా చిత్ర నిర్మాణం కొనసాగిస్తానా లేదా అనే విషయం గురించి నిర్ణయం తీసుకోలేదని భూమిక అన్నారు. అలాగే చిత్ర నిర్మాణం ఛాలెంజింగ్‌తో కూడుకుందని భూమిక వ్యాఖ్యానించారు. ఆమె రీసెంట్ గా తన భర్తతో కలసి తకిట తకిట చిత్రం రూపొందించారు. నూతన నటీనటులను పరిచయం చేస్తూ నిర్మించిన ఈ చిత్రంలో ఆమె అతిథి పాత్రలో నటించారు. ఇటీవలే తెరపైకి వచ్చిన ఈ చిత్రానికి ఆదరణ లభించ లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకునో ఏమో గానీ చిత్ర నిర్మాణం అంత సులభం కాదని స్టేట్మెంట్స్ ఇస్తోంది. అలాగే ఆమె ఇప్పటికే డౌన్ టౌన్ ప్రొడక్షన్స్ మూసేసిందని సమాచారం. ఇక ఆమె తాను ప్రస్తుతం ఒక తమిళ చిత్రంలో నటిస్తున్నానని చెప్పారు. హిందీలో తాను రాసిన కవితల పుస్తకాన్ని ఆవిష్కరించే పనిలో నిమగ్నమై ఉన్నానని, ఈ ఏడాది చివరిలోపు అవి మార్కెట్ ‌లో ఉంటాయని పేర్కొన్నారు. మొత్తానికి పైసా ఖర్చులేని వ్యవహారాలవైపే మొగ్గు చూపుతోందన్న మాట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu