»   » ‘బిచ్చగాడు’ గురించి మరో షాకింగ్ న్యూస్..

‘బిచ్చగాడు’ గురించి మరో షాకింగ్ న్యూస్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అవును.. ఇది షాకింగ్ న్యూస్ కాక మరేమిటి? హీరో...డైరెక్టర్, హీరోయిన్, నిర్మాణ సంస్థ వంటి విషయాలతో సంబంధం లేకుండా కేవలం సినిమాలో బలమైన కంటెంటు ఉండటం వల్లే ఓ సినిమా భారీ విజయం సాధించిన సందర్బాలు ఈ మధ్యకాలంలో జరుగలేదు.

స్టార్ హీరో ఉండాల్సిన అవసరం లేదు కేవలం మంచి నటుడైతే చాలు, భారీ బడ్జెట్ అంతకన్నా అక్కర్లేదు... సినిమా కథలో దమ్ము, దర్శకుడిలో నటీనుటల నుండి నటన రాబట్టే నైపుణ్యం ఉంటే చాలు సినిమా హిట్టవ్వడానికి అని నిరూపించిన చిత్రం 'బిచ్చగాడు'.


తమిళంలో తెరకెక్కించి తెలుగులో అనువాదం అయి టాలీవుడ్లో మొదలైన 'బిచ్చగాడు' సినిమా దండయాత్ర ఇంకా కొనసాగుతోంది. సైలెంట్‌గా వచ్చి వైలెంట్ హిట్ కొట్టిన బిచ్చగాడు 75 రోజులు కూడా దాటింది. అసలు ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాలు కూడా 75 రోజులు నడిచిన సందర్భాలే లేవు. ఒక వేళ నడిచినా ఐదో పదో థియేటర్లు. కానీ భిచ్చగాడు ఏకంగా 200 థియేటర్లలో 75 రోజులు పూర్తి చేసుకుంది.
అవును.. ఏ స్టార్‌కీ తీసిపోని రీతిలో సుమారు 200 థియేటర్లలో 75 రోజులు పూర్తి చేసుకుంది బిచ్చగాడు. ఈ మధ్య కాలంలో 50 రోజులే గొప్ప అనుకుంటే.. ఏకంగా 100 రోజుల వైపు దూసుకెళుతోంది బిచ్చగాడు సినిమా.


హిట్ టాక్

హిట్ టాక్

బిచ్చగాడు రిలీజైనప్పటి నుంచి హిట్‌టాక్‌తో నడిచింది. మొదట్లో చాలా తక్కువ థియేటర్లల నుంచి క్రమంగా వందల థియేటర్లకు విస్తరించింది.


కేక..

కేక..

తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్‌ పతాకంపై విజయ్‌ ఆంటోని, సత్న టైటస్‌ జంటగా ఫాతిమా ఆంటోని నిర్మించిన చిత్రం 'పిచ్చైకారన్‌'. ఈ చిత్రాన్ని తెలుగులో 'బిచ్చగాడు' పేరుతో చదలవాడ తిరుపతిరావు సమర్పణలో మే 13న విడుదల చేశారు.


మామూలు విషయంకాదు

మామూలు విషయంకాదు

భారీ అంచనాల మధ్య విడుదలైన ఎన్నో సినిమాలు ఓ పక్క ప్రేక్షకులను నిరాశ పరుస్తుంటే, ఏ అంచనా లేని బిచ్చగాడు ఈ రేంజ్ హిట్ కొట్టడం మాటలు విషయం కాదు.


భారీ సినిమాలను దాటి...

భారీ సినిమాలను దాటి...

బ్రహ్మోత్సవం, అ..ఆ.., కబాలి వంటి పెద్ద సినిమాల ధాటిని తట్టుకుని, తనకంటూ ఓ ఇమేజ్‌ను ఏర్పరుచుకొంది బిచ్చగాడు. తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా అంచనాల్లేకుండా విడుదలైన ఈ సినిమా కేవలం పబ్లిక్ మౌత్‌టాక్‌తోనే పుంజుకుని హౌస్‌ఫుల్ కలెక్షన్లతో అదరగొడ్తోంది.


భారీ లాభాలు...

భారీ లాభాలు...

తెలుగు రైట్స్ దక్కించుకున్న నిర్మాతకు డబ్బింగ్ ఖర్చులతో కలిపి రూ. 50 లక్షలు మాత్రమే ఖర్చయింది. ఇప్పటికీ ఈ చిత్రం నిర్మాతకు దాదాపు రూ. 25 కోట్లు వరకు తెచ్చిపెట్టింది


మంచి చిత్రాలను

మంచి చిత్రాలను

మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనడాని బిచ్చగాడు సినిమా మరోసారి నిరూపించింది. విజయ్ ఆంటోనీ అద్భుతమైన నటన, దర్శకుడు శశి మేకింగ్ తీరుతో ఈ సినిమా సక్సెస్ అయ్యింది. ఇంకా తల్లికొడుకుల సెంటిమెంట్‌తో ప్రేక్షకులను ఈ సినిమా భారీ స్థాయిలో ఆకట్టుకుంది.


English summary
Bichagadu movie 75 Days completed. Vijay Antony's dubbed film Bichagadu collections better than collections of other telugu movies.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu